Nitish Kumar Reddy : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు లో అభిషేక్ శర్మ, నితీశ్ రెడ్డి గత సీజన్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి గెలిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ లో మాత్రం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ చెరో మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ జట్టు 3 విజయాలు దక్కించుకుంది. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ తో విజయం తరువాత మాల్దీవ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేశారు సన్ రైజర్స్ ఆటగాళ్లు. అయితే నితీశ్ రెడ్డి మాత్రం సన్ రైజర్స్ ఆటగాళ్ల వెంట లేకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. నితీశ్ రెడ్డి హార్దిక్ పాండ్యా మాదిరిగా ఆల్ రౌండర్ గా ఎదుగుతాడనుకుంటే.. మరో విజయ్ శంకర్ అవుతున్నాడని సోషల్ మీడియాలో నితీశ్ పై ట్రోలింగ్ చేస్తున్నారు.
Also Read : Virat Kohli: ఆ హాట్ బ్యూటీని.. ఫాలో అవుతున్న విరాట్ కోహ్లీ… అనుష్క కొంప మునిగినట్టే
నితీశ్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. అయితే నితీశ్ రెడ్డి గత ఏడాది అద్భుతమైన ఫామ్ లో కొనసాగాడు. కానీ ఈ ఏడాది ఫామ్ కోల్పోవడం గమనార్హం. కేవలం నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే కాదు.. ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ మొత్తం అంతగా రాణించడం లేదు. ఈ సీజన్ లో ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 10 మ్యాచ్ లు ఆడగా.. అందులో కేవలం 3 మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించింది. తాజాగా జరిగిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తో కూడా ఓడిపోవడంతో సన్ రైజర్స్ జట్టు ప్లే ఆప్స్ అవకాశాలు కోల్పోయినట్టే చెప్పాలి. అసలు ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది ఏంది అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఏడాది ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వంటి బ్యాటర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో ప్రతీ మ్యాచ్ లో కూడా సులువుగా విజయం సాధించేది. కానీ ఈ ఏడాది ఎవ్వరూ ఆశించిన మేరకు రాణించడం లేదు. ముఖ్యంగా తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మాల్దీవ్స్ కూడా వెళ్లలేదు. అద్భుతంగా రాణిస్తాడని భావించారు. అయినప్పటికీ నితిష్ కుమార్ రెడ్డి 10 బంతుల్లో 21 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ గుజరాత్ టైటాన్స్ 225 పరుగుల లక్ష్యం ఇవ్వడంతో ఛేదించలేకపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆలౌరౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆర్సీబీ జెర్సీ వేసుకొని జిమ్ లో వర్కవుట్స్ చేయడం కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. తన కొడుకు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పటికీ ఆర్సీబీ జెర్సీ వేసుకోవడం వైరల్ గా మారుతోంది. వాస్తవానికి నితీష్ కుమార్ రెడ్డితో పాటు వారి కుటుంబం అంతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీకి అభిమానులు. నితీష్ రెడ్డి ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడాడు. 22.17 సగటు 114.45 స్ట్రైక్ రేటుతో 173 పరుగులు సాధించాడు.