Fazalhaq Farooqi: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా ఫిబ్రవరి 21 శుక్రవారం రోజున ఆఫ్ఘనిస్తాన్ – దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడవ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. శుక్రవారం కరాచీలో జరిగిన గ్రూప్ – బి మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ ని 107 పరుగుల తేడాతో ఓడించి తమ ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది సౌత్ ఆఫ్రికా. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.
ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ సెంచరీ తో చెలరేగాడు. 106 బంతులలో 103 పరుగులు సాధించాడు. అతనికి తోడు కెప్టెన్ టేంబా బవుమా {58}, ఎయిడెడ్ మార్క్కమ్ {50}, రాసీ వాన్ డెర్ డస్సేన్ {52} హాఫ్ సెంచరీలతో రాణించడంతో సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ సాధించగలిగింది. ఇక ఆఫ్గనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ నబీ 51 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. ఫజలక్ ఫరూఖీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 43.3 ఓవర్లలో 208 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా ఒక్కడే పోరాడి 92 బంతులను 90 పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. దీంతో ఆఫ్గనిస్తాన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా 3, లుంగీ ఎంగిడి 2, వియాన్ మల్డర్ 2, మార్కో జాన్సన్ 1, కేశవ్ మహారాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా గ్రూప్ బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా వారి రన్ రేట్ కూడా మెరుగయింది. మొత్తంగా సౌత్ ఆఫ్రికా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో మంచి ప్రదర్శన కనబరచడంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా మారింది.
అయితే ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో లాస్ట్ ఓవర్ 49.2 బాల్ ని ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరూఖీ వేసిన అనంతరం.. ఆ బాల్ కి మార్క్రమ్ సింగిల్ తీసుకొని నాన్ స్ట్రైకింగ్ కి వచ్చాడు. ఆ సందర్భంలో ఫరూఖీ మళ్ళీ బంతిని వేసేందుకు వెళుతూ మార్క్రమ్ ని కాస్త పక్కకి నెట్టాడు. ఆ తరువాత నవ్వుతూ మరో బంతి వేయడానికి వెళ్ళిపోయాడు. కానీ కామెంటేటర్లుగా వ్యవహరించిన ఎంబాగ్వా, షాన్ పోలాక్ ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు.
అలా చేయడం ఆశ్చర్యంగా ఉందని.. ఇది ఫ్రెండ్లీగా చేశాడా..? లేక సీరియస్ గా చేశాడా..? అని అర్థం కాలేదన్నారు. కానీ అతడు నెట్టివేసి క్రమంలో మార్క్రమ్ మాత్రం సాధారణంగానే స్పందించాడు. వీరిద్దరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో సహచరులుగా ఉన్నారు. ఆ చనువుతోనే అతడు ఇలా ప్రవర్తించి ఉండవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనిపై మ్యాచ్ రిఫరీ దృష్టి సారించి జరిమానా విధించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
Shame on Fazalhaq Farooqi. Should be penalised for this behaviour on field #SAvAFG pic.twitter.com/kjBsCP7dsP
— Mid-Wicket (@MidWicket11) February 21, 2025