Odela 2 Teaser Review : 2022లో రిలీజ్ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) మూవీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది ‘ఓదెల 2’ (Odela 2). ఈ మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ని చూశాక ఇందులో తమన్నా (Tamannah) తాండవం ‘అఖండ’ (Akhanda)ను మించినట్టుగా ఉందిగా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ట్రైలర్ రివ్యూ ఏంటో చూసేద్దాం పదండి.
‘ఓదెల 2’ ట్రైలర్ రివ్యూ
ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న మూవీ ‘ఓదెల 2’. ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్ నందితో కలిసి మధు క్రియేషన్స్ పథకం పై డి మధు ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తుంది. తాజాగా మేకర్స్ మహా కుంభమేళాలో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. అందులో తమన్నా శివశక్తిగా, లేడీ అఘోరాగా కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
మొదటి పార్ట్ లో హీరోయిన్ రాధా చంపేసిన తిరుపతి సెకండ్ పార్ట్ ‘ఓదెల 2’లో ప్రేతాత్మగా మారి జనాలను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు టీజర్ లో చూపించి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. ఇలాంటి పేతాత్మ నుంచి తమన్నా జనాలని ఎలా కాపాడింది? రాధ ఏమైపోయింది? తమన్నా శివ శక్తిగా ఎలా మారింది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే క్యూరియాసిటీని టీజర్ ద్వారా పెంచారు.
ఈ టీజర్ లో గ్రాఫిక్స్, విజువల్స్, అజనీష్ లోక్నాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా ఉన్నాయి. అలాగే తమన్నా రెండు లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంది. టీజర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ పూనకాలు తెప్పించే విధంగా ఉంది. గతంలో బాలయ్య నటించిన ‘అఖండ’ మూవీ టైంలో ఇలాంటి పాజిటివ్ వైబ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టీజర్ ని చూశాక మూవీలో తమన్నా తాండవం ‘అఖండ’ను మించి ఉండబోతుందనే అంచనాలు పెరిగిపోయాయి. తమన్నా ఫస్ట్ టైం ఈ మూవీలో శివ శక్తిగా, లేడీ అఘోరిగా నటిస్తోంది. అలాగే టీజర్ లో మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ రోల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
‘ఓదెల రైల్వే స్టేషన్’ స్టోరీ
రాధ, తిరుపతి భార్యాభర్తలు. బాగా చదువుకున్న తనను ఒక పనికిరాని వాడికిచ్చి పెళ్లి చేశారని ఆమె భావిస్తుంది. అందుకే ఏదో ఒక వంకతో దూరం పెడుతుంది. ఆ తరువాత దగ్గరవ్వడానికి భర్త ప్రయత్నించినా వర్కౌట్ కాదు. దీంతో భర్త సంసారనికి కూడా పనికిరాని వాడని ఫిక్స్ అవుతుంది. డాన్ని అవమానంగా భావించిన తిరుపతి సైకోలా మారి, ఊర్లో ఉన్న ఆడవాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడతాడు. ఇది తెలుసుకున్న రాధ తిరుపతిని కొట్టి చంపేస్తుంది.