Maas Jathara: మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా, శ్రీ లీలా (Sree Leela) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాస్ జాతర’. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా మొదటి పాట “తూ మేరా లవర్” ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. భాస్కరభట్ల రచించిన ఈ పాటలో ఏఐ ను ఉపయోగించి, దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ (Chakri) వాయిస్ ను రీ క్రియేట్ చేశారు. ఇక ఇక్కడ మళ్లీ దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి బ్రతికొచ్చినట్టు ఉందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ పాటలో ‘ ఇడియట్ ‘ మూవీలోని “చూపులతో గుచ్చి గుచ్చి” బీట్ ను కూడా యాడ్ చేశారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే తొమ్మిదవ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
మాస్ ఆడియన్స్ టార్గెట్ గా మాస్ జాతర..
మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మాస్ జాతర’ శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు ఫస్ట్ పాట కూడా రిలీజ్ చేయడంతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులో రవితేజ ప్రత్యేక డాన్స్ స్టెప్పులు, శ్రీ లీల అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఈ గీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు కుంటోందని చెప్పవచ్చు. ఇకపోతే అటు రవితేజ ఇటు భాను భోగవరపు అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా ఈ సినిమాను చాలా అద్భుతంగా మలుస్తున్నారు.
Amitabh Bachchan: మాజీ ప్రేయసి పై బిగ్ బీ కి నెటిజెన్ కొంటె సలహా.. రియాక్షన్ ఏంటంటే..?
సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, శ్రీ లీల..
ప్రముఖ ఛాయా గ్రహకుడు విధు అయ్యన్న తన ప్రభావంతమైన విజువల్స్ తో పాటకి తగ్గట్టుగా మాస్ వైబ్స్ అందించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా పని స్తున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ అందుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా ధమాకా మ్యాజిక్ ను రిపీట్ చేయాలని కూడా చూస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య ఊహించని సెంటిమెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాంటి మాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారో చూడాలి. అటు శ్రీ లీలా కూడా ఈమధ్య సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. చివరిగా ఈమె నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమా కూడా ఈమెకు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు.. మరి ఈ సినిమా వీళ్ళిద్దరికీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Mass Maharaaj @RaviTeja_offl
+ @sreeleela14
= Dance Floor Destruction 💥💥#TuMeraLover out now 🔥
— https://t.co/5Tj32eC4jq
A #BheemsCeciroleo Musical 🥁 #RaviTeja #Sreeleela #Tollywood #BIGTVCinema pic.twitter.com/xEDwRsa93v— BIG TV Cinema (@BigtvCinema) April 14, 2025