Umpire Checking Bat: ఐపీఎల్ 2025లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 13 ఆదివారం రోజు రెండు హై వోల్టేజ్ మ్యాచ్ లు జరిగాయి. మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా జరిగింది. ఇక రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై ఇండియన్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగింది.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో అంపైర్లు ప్లేయర్ల బ్యాట్లను తనిఖీ చేశారు. ఆదివారం రోజు జరిగిన ఈ డబుల్ హేడర్ మ్యాచ్ లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ – ముంబై జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్ ని చెక్ చేశారు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చిన సమయంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ పాండ్యా బ్యాట్ ని పరీక్షించాడు. బ్యాట్ ని కొలిచేందుకు ఓ పరికరాన్ని ఉపయోగించారు.
అయితే హార్దిక్ పాండ్యా బ్యాట్ అనుమతించబడిన పరిణామం 25 అంగుళాల లోపల ఉంది. ఈ మ్యాచ్ కి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోను ఫీల్ సాల్ట్, సిమ్రాన్ హిట్ మేయర్ బ్యాట్లను ఆన్ ఫీల్డ్ అంపైర్లు పరీక్షించారు. ఈ బ్యాట్లను పరిశీలించేందుకు అంపైర్ ఒక గేజ్ ని ఉపయోగిస్తున్నారు. బ్యాట్ మొత్తం పొడవునా గేజ్ ని తీసుకు వెళుతున్నారు.
అది ఏ సమయంలోనో కొలతలు దాటలేదని అంపైర్లు నిర్ధారించుకుంటున్నారు. సాధారణంగా బ్యాట్ సైజు గురించి నియమాలు ఏం చెబుతున్నాయి అంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేయింగ్ కండిషన్స్ లోని నియమం 5.7 ప్రకారం ఈ తనిఖీ నిర్వహించారు. దీని ప్రకారం బ్యాట్లు సైజ్ ల నిబంధనలకు అనుకూలంగా ఉండాలి.
Also Read: Karun Nair: నాదే దరిద్రం..బాగా ఆడాను..అందరూ ఆడితే గెలిచే వాళ్ళం
బ్యాట్ యొక్క మొత్తం పొడవు, హ్యాండిల్ తో సహా 38 అంగుళాలు.. అంటే 96.52cm మించకూడదు. అలాగే బ్యాట్ వెడల్పు 4.25 అంగుళాలు.. అనగా 10.8 సెంటీమీటర్ల లోతు, 2.64 అంగుళాలు { 6.7 cm} మరియు అంచులు 5.56 అంగుళాలు {4 cm} మించకూడదు. అదనంగా హ్యాండిల్ బ్యాట్ మొత్తం పొడవులో 52% మించకూడదు. ఇక బ్యాట్ అధికారిక బ్యాట్ గేజ్ గుండా అడ్డంకులు లేకుండా వెళ్లడం కూడా అవసరం. ఒకవేళ ఏదైనా బ్యాట్ ఐపిఎల్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. వారికి ప్రత్యక్ష జరిమానా విధించబడదు. నియమాలు పాటించకపోతే ఆటగాళ్లు తమ బ్యాట్లను మాత్రమే మార్చుకోవాలి. ఈ రకమైన నిరంతర ఉల్లంఘనలకు పాల్పడితే మాత్రం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">