BigTV English

AIR Trailer: ఐఐటీ సీట్లు, ర్యాంకుల కోసం పాట్లు.. ఓటీటీలోకి ‘ఎయిర్’ వెబ్ సీరిస్!

AIR Trailer: ఐఐటీ సీట్లు, ర్యాంకుల కోసం పాట్లు.. ఓటీటీలోకి ‘ఎయిర్’ వెబ్ సీరిస్!

All India Rankers Web Series Trailer:  ఈటీవీ విన్ లోకి మరో ఆసక్తికర వెబ్ సీరిస్ విడుదల కాబోతోంది. ఇప్పటికే తెలుగు నెటివిటీకి అనుగుణంగా రూపొందించిన పలు వెబ్ సీరిస్ లు ఈటీవీ విన్ లో విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో ఆసక్తికర కథనంతో కొత్త సీరిస్ ను విడుదల చేయబోతోంది. యువతను ఆకట్టుకునేలా ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ ను  తెరెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగా, తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. నవ్విస్తూనే, ఏడిపించే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులలో మంచి అంచనాలు పెంచింది.


ర్యాంకులే లక్ష్యంగా బట్టీ చదువులు!

నిజానికి ఈ రోజుల్లో ర్యాంకులే లక్ష్యంగా చదువులు సాగిపోతున్నాయి. అలాంటి చదువులను బేస్ చేసుకుని ఇప్పటికే హిందీలో పలు వెబ్ సీరిస్ లు వచ్చాయి. మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. తెలుగులో ఈ కథాంశంతో సినిమాలు కూడా వచ్చాయి. బాగానే అలరించాయి. ఇప్పుడు అదే స్టోరీ లైన్ లో వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సీరిస్ ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ పేరుతో విడుదల కాబోతోంది. ఈటీవీ విన్ ఒరిజినల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది.


జులై 3 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్‌

జోసెఫ్‌ క్లింటన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘AIR: ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌’ వెబ్ సిరీస్ లో హర్ష రోషన్‌, భాను ప్రకాశ్‌, జయతీర్థ, హర్ష చెముడు, రమణ భార్గవ్‌, చైతన్య రావు, జీవన్‌ కుమార్‌, సందీప్‌ రాజ్‌, సునీల్‌, అక్షర సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. జులై 3 నుంచి ఈటీవీ విన్‌ లో  స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా  ట్రైలర్‌ విడుదలైంది. “ఐఐటీ కోచింగ్‌ అంటే వినిపించేది ఆ రెండు కాలేజీలే.. కానీ ఇక నుంచి.. “ అంటూ సునీల్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆద్యంతం ఫన్నీగా సాగుతూ ఆకట్టుకుంది. ఈ రోజుల్లో ఇంటర్ చదువులు, ఐఐటీల్లో సీట్లు, ర్యాంకుల కోసం కష్టపడే స్టూడెంట్స్ చుట్టూ ఈ సీరిస్ కథ తిరుగుతుంది.

Read Also: బాలయ్య కోసం ఎన్టీఆర్ చంద్రమోహన్ ను మోసం చేశారా?

అట్టహాసంగా ట్రైలర్ లాంచ్

తాజాగా ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ వెబ్ సిరీస్ కు సంబంధించి మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శివాజీ, సుహాస్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ‘#90’ వెబ్ సీరిస్ కు మించి హిట్ అవుతుందన్నారు. చదవులు అవసరమే అని చెప్పిన ఆయన, విద్యార్థులపై విపరీతమైన ఒత్తడి పెట్టడం సరికాదన్నారు. ఈటీవీ విన్ నుంచి వచ్చే ఈ వెబ్ సిరీస్ మరో మంచి హిట్ సీరిస్ గా నిలుస్తుందన్నారు.

Read Also: బాసులు జల్సా చెయ్యాలంటే.. 70 గంటలు పని చెయ్యండి.. సోనీ లివ్ సెటైరికల్ ప్రోమో!

 

Related News

HHVM OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హరిహర వీరమల్లు… ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : శవంపై కోరిక… ఏకంగా బాయ్ ఫ్రెండ్ ముందే దాంతో ఆ పని… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమా మావా

OTT Movie : అమ్మ బాబోయ్… వీడు పిల్లాడు కాదు కిల్లర్… నెవర్ బిఫోర్ సైకో థ్రిల్లర్

OTT Movie : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్

OTT Movie : ట్రైన్ లో 59 మంది సజీవ దహనం… చరిత్ర దాచిన నిజాలు ఈ సిరీస్ లో బట్టబయలు… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

×