Ambati Rayudu : తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెటైర్లు వేశారు. ఐపీఎల్ ప్రారంభమైన 18 సంవత్సరాలకు ఒక్క ట్రోఫీ గెలిచిన బెంగళూరు జట్టుకు 5 ట్రోఫీలు గెలిచేందుకు 72 ఏళ్లు పడుతుంది అని ఓ ఇంటర్వ్యూలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వన్డేల్లో రోహిత్ శర్మ తరువాత టీమిండియా కి కెప్టెన్ అయ్యే అర్హతలు శ్రేయస్ అయ్యర్ కే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అంబటి రాయుడు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరపున ఆడాడు.
Also Read : Babar – Rohith : రోహిత్ శర్మ పరువు కాపాడిన పాకిస్తాన్… బాబర్ ను జట్టులోంచి తీసేసి !
ఆ రెండు జట్లూ కూడా 5 ట్రోఫీలు
అయితే ఆ రెండు జట్లు కూడా ఐపీఎల్ లో 5 ట్రోఫీలు సాధించడం విశేషం. ఐపీఎల్ లో అత్యధిక టైటిళ్లను సాధించిన జట్లుగా ముంబై, చెన్నై నిలిచాయి. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. ఆడింది 55 వన్డే మ్యాచ్ లే అయినప్పటికీ ఈ తెలుగు బ్యాటర్ అద్భుతంగా రాణించాడు. 47 యావరేజ్ తో 1694 పరుగులు చేసాడు. 2019 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా స్క్వాడ్ లో స్థానం సంపాదించుకోలేకపోవడంతో మనస్తాపానికి గురైన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తరువాత ఐపీఎల్ టోర్నీలలో ఆడుతూ తన క్రికెట్ కెరీర్ ను కొన్నేళ్ల పాటు కొనసాగించాడు. 2023 ఐపీఎల్ లో చెన్నై తరపున చివరి సీజన్ ఆడాడు రాయుడు. ఇక ఆ తరువాత క్రికెట్ కి గుడ్ బై చెప్పేసి కామెంట్రీ అవతారం ఎత్తాడు.
రాయుడు తనదైన ముద్ర..
ఇటీవల శుభాంకర్ మిశ్రా పాడ్ కాస్ట్ లో పాల్గొన్న రాయుడు.. తన ఆల్ టైమ్ టాప్ వన్డే బ్యాటర్లతో పాటు టీ-20 బ్యాటర్లను ఎంచుకున్నాడు. టీ-20 విషయానికి వస్తే.. మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లను తన టాప్-3 ప్లేయర్లు అని చెప్పుకొచ్చాడు. వీరు ముగ్గురు కూడా ఇప్పటికే టీ-20 ఫార్మాట్ లో తమదైన ముద్ర వేశారు. వీరి ముగ్గురితో పాటు పాటు క్రిస్ గేల్ కూడా ఫేవరేట్ ప్లేయర్ అని తెలిపాడు అంబటి రాయుడు. చాలా మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ వీరు ముగ్గురు నా ఫేవరేట్ అని రాసుకొచ్చాడు అంబటి రాయుడు. రాయుడు తన ఆల్ టైమ్ టాప్ 3 వన్డే బ్యాటర్లు సెలెక్ట్ చేసుకునే సమయంలో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలి, రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాళ్లను పట్టించుకోలేదు. తనకు ఇష్టమైన బ్యాట్స్ మెన్లు అని అడిగినప్పుడు భారగ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లను ఎంచుకున్నాడు. వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.