Rohit Sharma: భారత క్రికెట్ లోని అత్యుత్తమ ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకరు. పేద కుటుంబంలో జన్మించిన రోహిత్ శర్మ తన ప్రతిభతో టీమ్ ఇండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. 2006 – 07లో రంజి ట్రోఫీలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ.. 2007 జూన్ లో ఐర్లాండ్ తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు. అనంతరం అదే ఏడాది సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్ తో జరిగిన టి-20 ద్వారా {Rohit Sharma} పొట్టి ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Also Read: Chahal Dhanashree Divorce: చాహల్-ధనశ్రీ విడాకులలో ట్వస్ట్.. అప్పుడే మంట మొదలైంది..?
ఇక 2013 నవంబర్ లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా లాంగ్ ఫార్మాట్ లోకి అడుగు పెట్టాడు. 2020లో భారత జట్టు వైస్ కెప్టెన్ గా ఎన్నికైన రోహిత్, 2021 టీ-20 వరల్డ్ కప్ తర్వాత టి20 లో టీమిండియా కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత వన్డేల్లోనూ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. 2024లో వెస్టిండీస్-అమెరికా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ నీ రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గెలుపొందింది.
ఇక ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లోను {Rohit Sharma} భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు రోహిత్. మరోవైపు ఐపీఎల్ లోను 2013, 15, 2017,19, 20 సీజన్లలో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు విజేతగా నిలిచింది. ఐతే రోహిత్ ని పాకిస్తాన్ క్రికెట్ అవమానించింది. రోహిత్ శర్మని అనుకరిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది. అతడిని బాడీ షేమింగ్ కూడా చేసినట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ వాయిస్ తో పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విమర్శలకు దారితీస్తోంది. ఏప్రిల్ 11 నుండి పాకిస్తాన్ సూపర్ లీగ్ పిఎస్ఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ మస్కట్ విలేకరులతో మాట్లాడుతున్నట్లు ఉన్న వీడియో కి వాయిస్ ఓవర్ మాత్రం రోహిత్ శర్మ{Rohit Sharma} ది జత చేయడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ మాట్లాడిన వ్యాఖ్యలను.. తాజాగా మస్కట్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేశారు.
Also Read: Cricketers – Betting Apps case: బెట్టింగ్ యాప్ లు… క్రికెటర్ల పై చర్యలు ఉండవా?
దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ వీడియో పై భారత క్రికెట్ అభిమానులంతా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఓ సక్సెస్ఫుల్ కెప్టెన్ పై ఇలా బాడీ షేమింగ్ చేయడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. తక్షణమే ఆ వీడియోను డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముందు మీరు కనీసం ఒక్క ట్రోఫీనైనా గెలవాలని.. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఉపయోగం ఉండదని మండిపడుతున్నారు.
Multan Sultan has a funny video for T20 WC & Champions Trophy Winning Captain ~ Rohit Sharma 😯
~ What's your take on this video 🤔 seems like – "just for fun"🤪pic.twitter.com/kkIU7B7UQs
— Richard Kettleborough (@RichKettle07) March 21, 2025