South Central Railway Wins Acharya Shield: భారతీయ రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక జోన్ గా కొనసాగుతోంది. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలను కలిపే కీలక కేంద్రంగా పని చేస్తోంది. ప్రయాణీకులకు మెరుగైన రైల్వే సౌకర్యాన్ని కల్పించడంలో దక్షిణ మధ్య రైల్వే ముందుంటుంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచుతూ ప్రయాణీకులకు ఇబ్బందులు లేని మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నది. ఓ వైపు ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తూనే, మరోవైపు హిందీ భాషను ప్రమోట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే కు రైల్వే సంస్థ కీలక అవార్డును అందించింది.
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో హిందీకి అందలం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అధికార భాష హిందీని సమర్థవంతంగా అమలు చేయడం పట్ల కేంద్ర రైల్వే సంస్థ ప్రశంసల జల్లు కురిపించింది. అత్యుత్తమ పని తీరు దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే మంత్రి రాజ్ భాషా షీల్డ్ ను అందించింది. ఈ అవార్డు కోసం పలు రైల్వే జోన్ లో పోటీ పడగా సౌత్ సెంట్రల రైల్వే దక్కించుకుంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) లోని విజయవాడ డివిజన్ అధికారిక భాషను అమలు చేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మకమైన ‘ఆచార్య రఘువీర్ చల్ వైజయంతి షీల్డ్’ అందించింది. న్యూఢిల్లీ లోని రైల్ భవన్ లో జరిగిన సమావేశంలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సతీష్ కుమార్ ఈ అవార్డును డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ. పాటిల్ కు అందజేశారు.
दक्षिण मध्य रेलवे के लिए यह अत्यंत गौरव का विषय है कि राजभाषा कार्यान्वयन के क्षेत्र में उत्तम कार्यनिष्पादन के लिए इस रेलवे के प्रधान कार्यालय को रेल मंत्री राजभाषा शील्ड का प्रथम पुरस्कार, विजयवाडा मंडल को आदर्श मंडल के रूप में आचार्य रघुवीर चल वैजयंती, pic.twitter.com/b8KzGZkT4C
— South Central Railway (@SCRailwayIndia) March 20, 2025
Read Also: జరిమానా లేకుండా రిజర్వేషన్ కోచ్‌లో వెళ్లొచ్చు.. ఇదిగో ఇలా చేస్తే సరి!
సంతోషం వ్యక్తం చేసిన పాటిల్
హిందీని ప్రోత్సహించడంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంతో చక్కటి పని తీరు కనబర్చిందని పాటిల్ చెప్పారు. తమ జోన్ కు ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. అందులోనూ విజయవాడ డివిజన్ కు ఈ అవార్డు దక్కడం చాలా గర్వంగా ఉందన్నారు. అటు గుంటుపల్లిలోని రాయనపాడు వర్క్ షాప్ కు ‘ఆదర్శ కార్ఖానా’ లాంటి అవార్డు లభించిందని వెల్లడించారు. సౌత్ సెంట్రల్ జోన్ కు రైల్ మంత్రి రాజభాష షీల్డ్ లభించిందని తెలిపారు. విజయవాడ డివిజన్ ను ఆదర్శ్ మండల్ గా గుర్తించినట్లు వెల్లడించారు. రైల్వే బోర్డు అధికారిక భాషా అమలు కమిటీ సమావేశంలో రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సతీష్ కుమార్ నుంచి ఈ షీల్డ్ ను అందుకోవడం ఆనందంగా ఉందని నరేంద్ర ఎ పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డివిజన్ కు చెందిన రాజభాష అధికారి (RBA) MK నాగరాజు కూడా హాజరయ్యారు. ఈ అవార్డు రావడంలో నాగరాజు కృషి చాలా ఉందని పాటిల్ ప్రశంసించారు.
Read Also: వందే భారత్ రైళ్ల సేవలు పెంపు.. సికింద్రాబాద్ నుంచి కూడా, ఏయే రూట్లలో అంటే?