E-Paper
Advertisement

మ‌ళ్లీ తెర‌పైకి షేక్ హ్యాండ్ వివాదం…మా కాళ్ల ద‌గ్గ‌ర‌కు బీసీసీఐ వ‌చ్చిందంటూ ఓవరాక్ష‌న్

మ‌ళ్లీ తెర‌పైకి షేక్ హ్యాండ్ వివాదం…మా కాళ్ల ద‌గ్గ‌ర‌కు బీసీసీఐ వ‌చ్చిందంటూ ఓవరాక్ష‌న్
Advertisement

Furqan Bhatti On IND VS PAK Handshake:  ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (IND VS PAK) మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాదు ఎన్నో ఏండ్ల నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ఇక పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఐసీసీ టోర్నమెంట్లలో కూడా రెండు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ( IND VS PAK Handshake) ఇచ్చుకోవడం లేదు. దీనికి ముందుగా తెర లేపింది బీసీసీఐ. భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దల ఆదేశాల మేరకు.. పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు ఇండియన్ క్రికెటర్లు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొంది.

Also Read: Sikandar Raza Warns Team India: మాతో అంతా ఈజీగా ఉండదు.. టీమిండియాకు పీడకల మిగుల్చుతాం…జింబాబ్వే కెప్టెన్ వార్నింగ్

Advertisement

అయితే ఈ నేపథ్యంలో ఇండియాను అవమానించేలా పాకిస్తాన్ క్రికెట్ ఎనలిస్టు, ప్రముఖ యూట్యూబర్ ఫుర్ఖాన్ భట్టి ( Furqan Bhatti ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల త‌ర్వాత‌ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు బీసీసీఐ, మా కాళ్ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది అంటూ పాక్ యూట్యూబ‌ర్ భ‌ట్టి ఓవ‌రాక్ష‌న్ చేశారు. ఏషియ‌న్ గేమ్స్ సంద‌ర్భంగా మ‌ళ్లీ ఎప్ప‌టి లాగే, ఇండియా, పాక్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. దీంతో పాక్ యూట్యూబ‌ర్ భ‌ట్టి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

మ‌ళ్లీ తెర‌పైకి షేక్ హ్యాండ్ వివాదం

పహల్గామ్ సంఘటన తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య విభేదాలు మరింత పెరిగిపోయాయి. ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మళ్ళీ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రమంలో షేక్ హ్యాండ్ వివాదంపై పాక్ యూట్యూబ‌ర్ ఫుర్ఖాన్ భట్టి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో తమ పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై బీసీసీఐ ఇప్పుడు పశ్చాత్తాపం పడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మళ్లీ పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు టీమిండియా ముందుకు వస్తుందని వివరించారు.

పాకిస్తాన్ కాళ్ల ద‌గ్గ‌ర‌కు బీసీసీఐ వ‌చ్చిందంటూ ఓవరాక్ష‌న్

Advertisement

గతంలో జరిగిన తప్పిదానికి… పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమైందని బాంబు పేల్చారు. ఏషియన్ గేమ్స్ సందర్భంగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఇండియన్ క్రికెటర్లు ముందుకు వస్తే… పాక్ ప్లేయర్లు కూడా పెద్ద మనసు చేసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిందేనని సూచనలు చేశారు. బీసీసీఐ అడ్డదారి తొక్కిందని.. మనం కూడా అలాగే వెళ్లకూడదని హితువు పలికారు. దీంతో పాక్ యూట్యూబ‌ర్ ఫుర్ఖాన్ భట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

 

Also Read: MI London vs Sunrisers Leeds, 1st Match: కావ్య పాప‌కు బిగ్ షాక్‌…స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లు చూడకుండా కుట్ర‌లు !

Related News

Kavya Maran: నా డ‌బ్బు, నా ఇష్టం..ఎవ‌రినైనా కొనేస్తా?

గొడ‌వ‌లు మ‌ర్చిపోయి, మాతో టెస్ట్ సిరీస్ ఆడండి..బీసీసీఐని కోరిన న‌ఖ్వీ

పాకిస్తాన్ క్రికెట్ లో వాస్తు దోషం..PCB ఆఫీస్ మార్చాలంటూ ఆదేశాలు

పొద్దున లేస్తే.. రాముడిని, మోదీని తిడ‌తారా? ఇవేం దిక్కుమాలిన నిర‌స‌న‌లు !

ఐపీఎల్ గురించి త‌ప్పుగా మాట్లాడితే, ప‌ళ్లు రాల‌గొడ‌తా..ఇంట‌ర్వ్యూలోనే ఇచ్చిప‌డేసిన దినేష్ కార్తీక్‌

PCB మ‌రో దిక్కుమాలిన కండీష‌న్‌.. ‘పాడెల్’ ఆడితేనే జ‌ట్టు ఛాన్స్‌

ఐపీఎల్ ప‌ర‌మ చెత్త లీగ్…అందులో ఆడ‌టం కంటే, ఇంట్లో కూర్చోండి

Big Stories

Advertisement
×