E-Paper
Advertisement

28 బంతుల్లో వైభవ్ సెంచరీ..14 సిక్సర్లతో తాండవం, వన్డేల్లో ఫాస్టెస్ట్ శతకం చేసిన ప్లేయర్‌గా రికార్డు

28 బంతుల్లో వైభవ్ సెంచరీ..14 సిక్సర్లతో తాండవం, వన్డేల్లో ఫాస్టెస్ట్ శతకం చేసిన ప్లేయర్‌గా రికార్డు
Advertisement

Vaibhav Sooryavanshi Century:  రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్ లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. 28 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి, చరిత్ర సృష్టించాడు. ఏకంగా 14 సిక్సర్లు, 4 బౌండరీలు బాదిన వైభవ్ సూర్యవంశీ, 360 స్ట్రైక్ రేట్ తో తాండవం చేస్తున్నాడు. 28 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్.. లిస్ట్ ఏ క్రికెట్ లో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు ఆసీస్ ప్లేయర్ మెక్ గుర్క్ 29 బంతుల్లోనే సెంచరీ చేయగా, ఈ రికార్డును తాజాగా వైభవ్ బ్రేక్ చేశాడు. ఇదే ఇన్నింగ్స్ లోనే 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసిన వైభవ్… సెంచరీ చేయడానికి 12 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు.

28 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ..ఛేజింగ్ అదరగొడుతున్న టీమిండియా

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా, యూఏఈ జూనియర్ జట్ల మధ్య దోహా వేదికగా ఇవాళ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన యునైటేడ్ అరబ్ ఎమిరేట్స్ 50 ఓవర్లు ఆడి, 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు సాధించింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా ఒక్కడే 130 పరుగులతో యూఏఈని ఆదుకున్నాడు. దీంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఏ అదరగొడుతోంది. అభిషేక్ శర్మ 12 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 3 పరుగులకు ఔట్ అయినా, వైభవ్ సెంచరీతో ఇరగదీశాడు. ఇప్పటి వరకు 9 ఓవర్లు ఆడిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. మరో 88 పరుగులు సాధిస్తే, విక్టరీ కొట్టడం గ్యారెంటీ.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

ఇబ్రార్ అహ్మద్ తో అభిషేక్ శర్మ గొడవ

ఛేజింగ్ సమయంలో యూఏఈ బౌలర్ ఇబ్రార్ అహ్మద్ తో అభిషేక్ శర్మ గొడవ పడ్డాడు. ఇబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో 12 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఎల్బీడబ్ల్యూ ఔట్ అయ్యాడు. ఈ తరుణంలోనే ఇబ్రార్ అహ్మద్ అగ్రెసివ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో మండిపోయిన అభిషేక్ శర్మ వెంటనే సీరియస్ అయ్యాడు. ఇబ్రార్ అహ్మద్ పైకి దూసుకొచ్చాడు. అటు ఇబ్రార్ కూడా తగ్గలేదు. ఇంతలోనే మరో యూఏఈ ప్లేయర్ వచ్చి, ఇబ్రార్ అహ్మద్ ను పక్కకు లాక్కెళ్లాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ రక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో అభిషేక్ శర్మది కరెక్ట్ అంటుంటే, మరికొందరు యూఏఈ బౌలర్ ను సపోర్ట్ చేస్తున్నారు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

 

 

 

Related News

టీమిండియా కుప్పకూల్చిన మాట్ హెన్రీపై పాకిస్తాన్ కోట్ల వ‌ర్షం..ఏకంగా PKR 7.07 crore

కావ్య పాప రిసెప్ష‌న్ లో మెరిసిన‌ ముత్తయ్య మురళీధరన్ భార్య..హీరోయిన్ ను మించిపోయిందిగా

టీమిండియాపై కొట్టిన ప్ర‌తీ బౌండ‌రీ,సిక్స‌రుకు 100 పాకిస్తానీ రుపాయలు

హైద‌రాబాద్ బిర్యానీ ఆశ‌చూపి ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టిస్తారు..అంబ‌టి రాయులు సంచ‌ల‌నం!

గుడ్డిగా బ్యాట్ ఊపే వైభ‌వ్..వ‌న్డేల‌కు ప‌నికిరాడు, TRP కోస‌మే వాడిని ఆడిస్తున్నారు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌కు నీకు బుర్ర ఉందా..తోటి ప్లేయ‌ర్ల‌ను మీడియా ముందు అవ‌మానిస్తావా?

తిల‌క్ వ‌ర్మ ఇంత దిగ‌జారాడా? వైభ‌వ్ ను కీలుబొమ్మ చేసి అంపైర్ పైకి ఉసిగొల్పాడా!

Big Stories

Advertisement
×