Gambhir knows all Kohli’s Records says Former cricketer Piyush Chawla: ఆ ఇద్దరు క్రికెటర్ల మధ్య వ్యవహారం ఉప్పు-నిప్పుగా ఉంటుంది. ఒకసారి జరిగిన గొడవ.. వారిద్దరి మధ్యా దూరాన్ని పెంచింది. చాలాకాలం మాట్లాడుకోలేదు. కానీ ఇప్పుడు.. వారిద్దరూ కలిసి దేశం కోసం పని చేస్తున్నారు. వారిద్దరు ఎవరో కాదు.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అయితే, మరొకరు స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ..
ఇటీవలే వీరిద్దరూ శ్రీలంక టూర్ లో కలిశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో మళ్లీ కలిశారు. ఆల్రడీ ట్రైనింగ్ క్యాంప్ స్టార్ట్ అయ్యింది. విరాట్ కొహ్లీ లండన్ నుంచి సరాసరి క్యాంప్ వద్దకు వచ్చేశాడు. అయితే వీరిద్దరికి సంబంధించి జనంలో కొన్ని అపోహలున్నాయి. అవి సరికాదని మాజీ క్రికెటర్ పీయూష్ చావ్లా తన అనుభవంలో జరిగిన ఒక సంగతి తెలిపాడు.
భారత జట్టు క్రికెటర్లకు సంబంధించి ప్రతి అంశంపైన, వారి వ్యక్తిగత రికార్డులపై గౌతం గంభీర్ కి ఎనలేని పట్టుంది. అందుకే ఎవరినెప్పుడు ఎలా వాడాలో తనకి బాగా తెలుసునని అంటుంటారు. అదే విషయాన్ని చావ్లా తెలిపాడు.
నేనూ, గౌతంగంభీర్ కలిసి ఒక షో చేస్తున్నాం. అక్కడ యాంకర్ సరదాగా క్విజ్ లో అడిగినట్టు.. విరాట్ కొహ్లీ 50వ సెంచరీ ఎప్పుడు చేశాడు? అని ఒక ప్రశ్నవేశాడు. దానికి నేను తెల్లముఖం వేశాను.
కానీ గంభీర్ వెంటనే స్పందించాడు. ఏ మ్యాచ్ లో చేశాడో, ఎప్పుడు చేశాడో, ఎక్కడ చేశాడో కూడా ఠకీఠకీమని తెలిపాడు. ఇదంతా చూశాక నాకనిపించింది.
Also Read: సోషల్ మీడియాలో అతని ఫాలోవర్స్.. 100 కోట్లు
విరాట్ కి తనకి మధ్య ఆటలో సహజంగా జరిగిన గొడవలే కానీ, మరొకటి కాదని అనుకున్నాను. నిజంగా గౌతీ చాలా క్లాస్. ఒక ట్రస్ట్ నడుపుతున్నాడు. ఎంతోమంది పేదవాళ్లకి సహాయం చేస్తున్నాడు. ఇలా చూసుకుంటే అన్నింటా ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తుల్లో తను కూడా ఒకరని అన్నాడు.
నేను, గౌతం కలిసి నాలుగైదేళ్లు జాతీయ జట్టుకి ఆడాం. అందుకే తనని దగ్గరుండి చూశాను. చాలా కామ్ గా ఉంటాడు. ఆటలో ఎంత దూకుడుగా ఉండాలో అంతే దూకుడుగా ఉంటాడు. అలాగే చాలా సరదాగా కూడా ఉంటాడు. అందుకే నాకు తెలిసి మంచి వ్యక్తుల్లో గౌతం ఒకరని గట్టిగా చెప్పగలనని అన్నాడు.
అయితే గౌతం గంభీర్ కి క్రికెట్ బుర్ర ఎక్కువని అందరూ అంటారు. అందుకే కోల్ కతా నైట్ రైడర్స్ అలా ఛాంపియన్ అయ్యిందని అంటుంటారు. ఒక క్రికెటర్ దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉందంటే, అతని కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఎంత పోరాటమైనా చేస్తాడు…ఎంత తగ్గమన్నా తగ్గుతాడు. అందుకే విరాట్ కొహ్లీ విషయంలో తనెప్పుడు సానుకూలంగానే ఉంటాడని అంటున్నారు.