Matka Movie Varun Tej photo: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎంతో మంది హీరోలు పలు సినిమాలు చేస్తూ హిట్లతో దూసుకుపోతున్నారు. కానీ అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం హిట్ మొహం చూసి చాలా కాలమే అయింది. అదృష్టం లేకనా లేక కథలు ఎంచుకోవడంలో సరైన ఆలోచన లేకనో గాని ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. 2023లో ‘గాంఢీవదారి అర్జున’ సినిమా చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోయింది. బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలం అయింది. కలెక్షన్లు సైతం పెద్దగా రాలేదు. ఆ తర్వాత 2024 మార్చిలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చాడు. ఈ సినిమా కూడా ఎన్నో అంచనాలను రిలీజ్‌కు ముందే క్రియేట్ చేసింది. పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్క అప్డేట్ సినిమా రేంజ్‌ను మార్చేశాయి.
ఈ సినిమా వరుణ్ తేజ్‌ను కంబ్యాక్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను ఈ సినిమా తలకిందులు చేసింది. పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించాడు. అలాగే ఇందులో మానూషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. తదితర నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దీంతో వరుణ్ తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే ఇప్పుడొక పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.
Also Read: ‘మట్కా’ కింగ్.. రెండు లుక్స్‌లో వేరియేషన్ చూపించిన వరుణ్ తేజ్
కరుణ్ కుమార్ దర్శకత్వంలో వరుణ్ చేస్తున్న కొత్త సినిమా ‘మట్కా’. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలకమైన సన్నివేశాలను చిత్రబృందం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి వరుణ్ తేజ్‌కు సంబంధించి ఓ ఫొటో లీక్ అయింది. అందులో వరుణ్ లుక్ అత్యంత ఆసక్తికరంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వరుణ్ గెటప్స్ రిలీజ్ అయి ప్రేక్షకాభిమానుల్లో క్యూరియాసిటీ పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈ ఫొటో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సెట్స్‌లో వరున్ రింగు రింగుల జుట్టుతో మెడలో ఎర్ర కండువా వేసుకుని జిడ్డు ఫేస్‌తో కనిపిస్తున్న లుక్ అత్యద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ లుక్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సారి హిట్ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. అరెరే ఎట్లా ఉండేవాడు ఎట్లా అయిపోయాడు అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ అనంతరం సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో వరుణ్ సరసన మీనాక్షి చౌదరి, బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ల పతాకాలపై రూపొందుతోంది. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్‌లు రానున్నాయి.
#leaked మట్కాలో @IAmVarunTej రెండో గెటప్ pic.twitter.com/ak4hEKfRsK
— devipriya (@sairaaj44) September 14, 2024