Renu desai reacts to the dog harassment incident: గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తో విడిపోయి తన పిల్లలతో విడిగా ఉంటూ వస్తున్నారు రేణు దేశాయ్. ఆత్మవిశ్వాసం తో మాట్లాడే రేణుదేశాయ్ తన గురించి గానీ, తన పిల్లల గురించి గానీ ఎవరైనా వ్యక్తిగత వ్యవహారాల జోలికి వస్తే మాత్రం వెంటనే వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపాడేస్తుంటారు. అయితే రీసెంట్ గా పవన్ పిల్లలు తన తండ్రితో కలిసి ఆయన డిప్యూటీ మినిస్టర్ అయిన సందర్భంగా ఫొటోలు కూడా దిగారు. అకీరాను చూసి అంతా జూనియర్ పవన్ అంటూ కామెంట్స్ కూడా చేశారు. హీరో అయిపోవాలంటూ..కామెంట్స్ పెట్టారు. దీనికి రేణు దేశాయ్ కాస్త ఘాటుగానే స్పందించారు అప్పట్లో .
వెంటనే రియాక్ట్
ఈ విషయమై తాను ఏకీభవించడం లేదంటూ ట్విట్టర్ ఎకౌంట్ నుంచి వైదొలగారు కూడా. సామాజిక అంశాలపై ఎక్కువగా శ్రద్ధవహించే రేణుదేశాయ్ పేద పిల్లల చదువులు, మూగ జీవాల సంరక్షణ కోసం ఆమె ఫండ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. తన వంతుగా సామాజిక సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు రేణుదేశాయ్. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. తన పిల్లలు తప్పు చేసినా సరిద్దేందుకు ఏ మాత్రం వెనకాడరు. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు మా అన్నయ్యని వదిలేసి చాలా తప్పు చేశావ్ అంటూ కామెంట్ చేశాడు. దానికి వెంటనే స్పందించిన రేణు దేశాయ్ పవన్ ని నేను వదిలేయడం కాదు..ఆయనే నన్ను వదిలేశాడు అంటూ అభిమానిపై ఫైర్ అయ్యారు.
సామాజిక అంశంపై స్పందన
సామాజిక సమస్యలపై వెంటనే స్సందించే రేణుదేశాయ్ ఇటీవల ఓ వీడియో చూసి చలించిపోయారు. ఓ యువకుడు కుక్కను గిరగిరా తిప్పి బయటకు గిరాటు వేసిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. వెంటనే స్పందించి ఆ వీడియోను షేర్ చేస్తూ తనకి అతని అడ్రస్ కావాలంటూ, ఫోన్ నెంబర్ అతని గురించి ఏదైనా ఉంటే చెప్పాలంటూ పోస్ట్ చేశారు. తర్వాత అతనిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలియడంతో పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. పైగా తన ఫాలోవర్స్ కి కూడా మీరు కూడా ఇలాంటి క్రూరమైన పనులకు దూరంగా ఉండండి. మనుషుల్లా ప్రవర్తించండి. ఇలాంటి తప్పులు చేస్తే పోలీసులు అరెస్టు చేస్తారు. కేవలం వీడియో చూసి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారని..కొందరు కావాలని ఇలాంటి వీడియోలు షేర్ చేసి లైకుల కోసం పాకులాడుతూ ఉంటారని..అటువంటి వాటికి దూరంగా ఉండాల్సిందిగా రేణు దేశాయ్ కోరారు.