E-Paper
Advertisement

ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూత

ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం.. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి కన్నుమూత
Advertisement

Narasimha Reddy: భువనగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయ నాయకుడు కొమ్మిడి నర్సింహారెడ్డి (83) ఇకలేరు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పరితపించిన ఒక గొప్ప నిబద్ధత గల నాయకుడిని కోల్పోవడంతో భువనగిరి ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణవార్త విన్న రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ప్రజలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌తో అనుబంధం..
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కొమ్మిడి నర్సింహారెడ్డి.. 1978, 1983 లలో కాంగ్రెస్ పార్టీ తరపున వరుసగా రెండుసార్లు భువనగిరి శాసనసభ్యుడిగా (MLA) ఎన్నికయ్యారు. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షానే నిలిచి పోరాటాలు చేయడం ఆయన నైజం. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాను పీడించిన ప్రధాన మహమ్మారి ‘ఫ్లోరైడ్’ సమస్యపై ఆయన గళమెత్తారు. ఫ్లోరైడ్ బాధితులకు న్యాయం జరగాలని, ఆ ప్రాంత ప్రజలకు సురక్షితమైన మంచినీరు అందాలని క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీ వరకు ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Advertisement

మూడు వందల ఎకరాల భూదానం..
మాటల్లోనే కాకుండా చేతల్లోనూ మానవత్వాన్ని చాటుకున్న అరుదైన నాయకుడు నర్సింహారెడ్డి. పేదరికంపై పోరాటంలో భాగంగా తన సొంత ఆస్తి అయిన దాదాపు 300 ఎకరాల భూమిని నిరుపేదలకు దానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నేటి తరం రాజకీయాలకు ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయమైన పాఠం.

Also Read: సంజు శాంస‌న్ క్రైస్తవ మ‌త‌స్థుడు..అందుకే టీమిండియా నుంచి పంపించేశారు!

Related News

ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

‘కేటీఆర్ పిల్లలే చెప్పారు’.. బీఆర్ఎస్ గుట్టు విప్పిన సామా రామ్మోహన్!

ఎల్బీనగర్‌లో విచ్చలవిడిగా స్పా సెంటర్లు.. మధు యాష్కీపై కాంగ్రెస్ మహిళా నేత ఫిర్యాదు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్.. కీలక అంశాలపై చర్చలు!

ఓర్నాయనో.. రాయదుర్గం భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ.264 కోట్లు..

కాంగ్రెస్ వివాదంపై మౌనం వీడిన కొండా సురేఖ.. త్వరలో అసలు నిజాలు బయటపెడతా..!

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 10 మంది ఎమ్మెల్యేల జాతకం తేలేది అప్పుడే!

Big Stories

Advertisement
×