Gautam Gambhir Pulls Virat Kohli’s Leg Ahead of IND vs BAN Test Series: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ గంభీర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే.. అలాంటి వారిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు.
బుధవారం రోజున భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సంచలనాలు సృష్టిస్తుంది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరూ కనిపించారు. భారత హెడ్ కోచ్ గంభీర్, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య ఎప్పటినుంచో వివాదాలు ఉన్నాయన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే.
ఆన్ ఫీల్డ్ లో అయితే ఇద్దరి మధ్య ఎన్నోసార్లు వివాదాలు చెలరేగినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. లక్నో మెంటార్ గా ఉన్న సమయంలో కూడా గంభీర్ ఆర్సిబి ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీకి గొడవలు జరగడం ఇప్పటికీ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గుర్తుండే ఉంటుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విరాట్ కోహ్లీపై గంభీర్ ఎప్పుడు విమర్శలు చేస్తుండేవాడు. అయితే గంభీర్ టీం ఇండియా హెడ్ కోచ్ గా వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీమిండియా కోచ్ గా గంభీర్ ఉండగా…. అతని కోచింగ్ లో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో కనిపించారు.
దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో కలిసి ఉన్న వీడియోను బీసీసీఐ షేర్ చేసుకుంది. బీసీసీఐ తన క్యాప్షన్ లో చాలా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అని రాసుకోచ్చారు. క్రికెట్ మనసులు ఎంత గొప్పగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి వేచి ఉండండి అని పేర్కొంది. “వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ” పేరుతో 40 సెకండ్ల నిడివి ఉన్న వీడియోను మాత్రమే బీసీసీఐ షేర్ చేసుకుంది. ఇందులో బ్యాటర్ ఏకాగ్రతను స్లెడ్జింగ్ ఎలా ప్రభావితం చేస్తుందనే అంశం గురించి కోహ్లీ, గంభీర్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్ధులతో మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు….మాటల్లో పడి పరధ్యానంగా ఉండిపోతారా… లేదంటే మోటివేట్ అయ్యి ఇంకా మంచిగా ఆట ఆడేటువంటి అవకాశం ఉందా అని గౌతీని కోహ్లీ ప్రశ్నిస్తాడు.
Also Read: Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్ ఎలా చూడాలంటే..?
అందుకు గౌతి ఫన్నీగా సమాధానం ఇచ్చారు. నాకన్నా నీకే ప్రత్యర్ధులతో ఎక్కువగా గొడవలు జరిగాయి. నువ్వే ఆ ప్రశ్నకు నాకంటే బాగా సమాధానం చెప్పగలరని భావిస్తున్నాను అని గౌతి ఆన్సర్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఇంటర్వ్యూలో నవ్వులు విరబూసాయి. అలాగే 2014-15లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ చాలా పరుగులు సాధించాడు అంటూ గంభీర్ కోహ్లీని ప్రశంసించాడు. కోహ్లీ ప్రత్యర్థులను రెచ్చగొట్టడం వల్ల ఇరగదీసాడని వ్యాఖ్యానించారు. తాను అందుకే న్యూజిలాండ్ తో 2009లో జరిగిన మ్యాచులో అదరగొట్టానని చెప్పాడు. అయితే..ఈ వీడియో ప్రోమోలోనే చాలా మసలా స్పష్టంగా కనిపించింది. దీంతో ఫుల్ వీడియో కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.