Gautam Gambhir serious On Shubman Gill: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka vs India) మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ( India tour of Sri Lanka 2026) ఇవాల్టితో ముగిసింది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా.. రెండు టెస్ట్ ను పొగొట్టుకుంది. చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజార్చుకుంది. ఐదవ రోజు శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా డిఫెన్స్ చేసిన నేపథ్యంలో రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. టీమిండియా ఈ సిరీస్ కైవసం చేసుకున్నప్పటికీ కూడా… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ చేరుకునే అవకాశాన్ని క్లిష్టంగా మార్చుకుంది.
కొలంబో వేదికగా రెండో టెస్టు ( Sri Lanka vs India, 2nd Test) జరగగా…. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టీమిండియా ప్లేయర్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ గిల్ కు మిడిల్ ఫింగర్ కూడా గౌతమ్ గంభీర్ చూపించినట్లు ఫోటో వైరల్ గా మారింది.
కుర్చీలో కూర్చున్న కెప్టెన్ గిల్ ను ఉద్దేశించి… గంభీర్ క్లాస్ పీకాడట. ఐదవ రోజు శ్రీలంక వికెట్లు ఎందుకు త్వరగా పడగొట్టలేదని.. అందరి ముందే గిల్ ను గంభీర్ కడిగి పారేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గిల్ ఎదురు తిరిగాడని చెబుతున్నారు. అందుకే మిడిల్ ఫింగర్ గంభీర్ చూయించి, ఉంటాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఎలాంటి గొడవలు జరుగలేదని మరికొందరు పేర్కొంటున్నారు.
శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ పూర్తయిన నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లెక్కలు తారు మారయ్యాయి. రెండు టెస్టు డ్రా కావడంతో, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ టీం ఇండియా చేరడం కష్టమేనని అంటున్నారు. టీమిండియా మరో 7 టెస్టులు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో ఆడాల్సి ఉంది. ఇందులో న్యూజిలాండ్ జట్టుపై రెండు… ఆస్ట్రేలియాపై ఐదు ఆడాలి. ఈ రెండు టీం ఇండియా కంటే బలమైనవే. ముఖ్యంగా టెస్టుల్లో ఇరగదీయడం ఖాయం. ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు జట్లను టీమిండియా ఓడిస్తుందా ? లేదా? అనేది కూడా చూడాలి. ఒకవేళ అదృష్టం బాగుండి ఏడు మ్యాచ్ లు గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు టీమిండియా చేరనుంది. అప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ ఉంటుంది.