Gambhir On Ms Dhoni: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సరిగ్గా ఏడాది సమయంలోనే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. దీనికోసం ఇప్పటినుంచే వన్డే జట్టును ప్రిపేర్ చేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. గిల్ కెప్టెన్సీలో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ఆడనుంది టీమిండియా. ఈ జట్టులో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా భాగస్వామ్యం కానున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మహేంద్రసింగ్ ధోని సేవలను వినియోగించుకోవాలని బీసీసీఐకి సూచనలు చేశారట గౌతమ్ గంభీర్.
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాగైనా టైటిల్ గెలవాలన్న కసితో టీమిండియా కనిపిస్తోంది. 2023లో ఫైనల్స్ దాకా వెళ్ళిన టీమిండియా, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఓటమిపాలైంది. అయితే ఆ తప్పిదం మళ్లీ రిపీట్ కాకూడదని.. ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే గౌతమ్ గంభీర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారట. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం మహేంద్రసింగ్ ధోని సేవలను వినియోగించుకోవాలని బీసీసీఐకి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా మెంటార్ గా మహేంద్ర సింగ్ ధోనీని నియామకం చేయాలని స్వయంగా గౌతమ్ గంభీరే సరికొత్త డిమాండ్ తీసుకువచ్చారట. మహేంద్ర సింగ్ ధోని సేవలను వినియోగించుకుంటే ఈసారి కచ్చితంగా టోర్నమెంట్ గెలుస్తామని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారట. తన కోచింగ్ తో పాటు ధోని మెలికలు యాడ్ అవుతే.. ఈసారి టోర్నమెంట్ మనదే అని బీసీసీఐకి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక బీసీసీఐ కూడా గంభీర్ చెప్పిన సూచన పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది.
దీనిపై ఈ వారం రోజుల్లో బీసీసీఐ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేయనుందట. దీనికి అజిత్ అగార్కర్, గంభీర్ హాజరవుతారని తెలుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా ఈ మీటింగ్ ఉండనున్నట్లు సమాచారం. ఈ మీటింగ్లో ధోనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకొని… అతడికి సమాచారం అందించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ విన్న క్రికెట్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. మహేంద్ర సింగ్ ధోని బరిలోకి దిగితే… 2011 చరిత్ర తిరగ రాయడం గ్యారంటీ అంటున్నారు. గౌతమ్ గంభీర్ చేతులెత్తేసాడని… వాడికి చేతకాక ఇలా ధోని సలహా తీసుకుంటున్నాడని మరికొంతమంది కౌంటర్ ఇస్తున్నారు. టైటిల్ గెలిస్తే తన ఖాతాలో వేసుకుందామని… ఓడితే ధోనిపై నెట్టేయడం కోసమే గంభీర్ ఈ స్కెచ్ వేసినట్లు మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి గంభీర్ స్కెచ్ వేశాడంటే ఏదో కుట్రకోణం ఉందని మాత్రం అభిమానులు కోడైకూస్తున్నారు.