E-Paper
Advertisement

దేవుడికి దండం పెట్టినా త‌ప్పేనా? ఏపీలో కుల‌, మ‌త రాజ‌కీయాల కుమ్ములాట‌లు!

దేవుడికి దండం పెట్టినా త‌ప్పేనా? ఏపీలో కుల‌, మ‌త రాజ‌కీయాల కుమ్ములాట‌లు!
Advertisement

దాసుడి త‌ప్పులు దండంతో స‌రి! అంటారు. జ‌గ‌న్  వెంక‌టేశ్వ‌ర స్వామికి దండం పెట్టాడు. ఇదే పెద్ద త‌ప్పై కూర్చుందిప్పుడు. దీనిపై నిల‌దీశాడు ఏపీ సీఎం చంద్ర‌బాబు. ఇదేం వార్త‌? ఇవేం రాజ‌కీయాలు? అనే క‌దా మీ డౌట్! ఏపీలో అంతే ..ఏపీలో అంతే అనాల్సి ఉంటుంది ముందు. కుల రాజ‌కీయాలే కాదు.. ఇక్క‌డ మ‌త రాజ‌కీయాలు కూడా మ‌స్తుగా మ‌జా చేస్తున్నాయి. నేత‌ల కుమ్ములాట‌ల‌ను జ‌నం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ఇప్ప‌టి దాకా గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఏపీ స‌ర్కార్‌ను ముప్పు తిప్ప‌లు పెడుతూ వ‌స్తోంది. దీనికి కులం రంగు పులిమారు. బాధితుడు, నిందితుడు గాదె సాయికృష్ణ‌ది కాపు కులం, ప‌వ‌న్‌ది కాపు కులం.. మ‌రి అత‌ను క‌నిపిచంకుండా పోయినా.. ప‌వ‌న్ ప‌ట్టించుకోడా? ఇదో కొత్త‌కోణం తీసుకొచ్చారు వైసీపీ నేత‌లు. నేనెందుకు ప‌ట్టించుకోవాలె..? నా కులంలో పుడితే వాడు దొంగైనా, క్రిమిన‌లైనా నేను వ‌త్తాసు ప‌ల‌క‌ల్నా? అన్నాడు ప‌వ‌న్‌.

Advertisement

ఇప్పుడు సాయికృష్ణ లాక‌ప్ డెత్ అయ్యాడ‌ని తెలియ‌గానే.. చంద్ర‌బాబు అందుకున్నాడు. చ‌నిపోయిన సాయికృష్ణ‌ది కాపు కుల‌మే, ఆ చంపిన సీఐ నాగ‌రాజుదీ కాపు కుల‌మే.. కాబ‌ట్టి ఇందులో కుల వివక్ష లేదు అని కొత్త తీర్పు ఇచ్చాడు. అదింకా చ‌ల్ల‌బ‌డ‌లేదు. ఇప్పుడు దేవుళ్ల‌కు దండాల పేరుతో కొత్త‌గా మ‌త రాజ‌కీయాలు కూడా దీనికి తోడ‌య్యాయి.

జ‌గ‌న్ ఏడుకొండ‌ల వాడికి దండం పెట్టాడ‌ట‌. అంతే.. క‌స్సున లేచాడు బాబు. ఏమ‌య్యా..! ప‌విత్ర‌మైన తిరుప‌తి ల‌డ్డులో వాడే నెయ్యినే నువ్వు క‌ల్తీ చేశావు? సిగ్గుందా నీకు మ‌ళ్లీ పోయి దండం పెడుతున్నావ్‌..! అన్నాడు. ఇంత‌లా తిట్టాల్సిన అవ‌స‌ర‌మేమొచ్చిందో అర్థం కాలేదు. అంతే కాదు.. మాకు తెలుసు.. మా దేవుడిని మేం ఎలా కాపాడుకోవాలో..! అని కూడా అన్నాడు.

Advertisement

ఇదేంద‌య్యో..! జ‌గ‌న్ మీ దేవుడిని ఏం చేయ‌బోతున్నాడు? ఎందుకా డౌట్ వ‌చ్చింది? అస‌లు మీ దేవుడు…? మా దేవుడు..? ఏంటీ.. ఇది కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది. దీంతో ఆగాడా? లేదు. నీ మతం నువ్వు న‌మ్ముకో… నీ దేవుడిని నువ్వు మొక్కుకో.. మాకు ఇబ్బంది లేదు.. కానీ.. అంటూ ఇక్కడ మ‌తాలు, దేవుళ్లు, ప్రార్థ‌న‌లు, దండాలు.. అన్నీ రాజ‌కీయం చేసి కంపు కంపు, ర‌చ్చ ర‌చ్చ చేశాడు చంద్ర‌బాబు.

ఇక రంగంలోకి పేర్ని నాని దిగాడు. నీ క‌న్నా చిన్న‌వాడు మోడీ ముందు నువ్వు మోక‌రిల్లావుగా..! మ‌రి నీకు లేదా సిగ్గు? దేవున్ని మొక్కితే జ‌గ‌న్‌కు ఎందుకు సిగ్గు? అన్నాడు. పాయింటే. ఇంకా అన్నాడు… నువ్వు నెత్తిన ముస్లిం టోపీ పెట్టుకోవ‌డం లేదా? బైబిల్‌లో వాక్యం చ‌ద‌వ‌డం లేదా? మ‌రి నువ్వెందుకు సిగ్గు ప‌డ‌వు?

ఓర్నీ ఉంటా ఉంటే.. మ‌రీ దిగ‌జారి పోతున్నాయ‌నిపిస్తుంది క‌దూ ఏపీ రాజ‌కీయాలు. అక్క‌డంతే. చైత‌న్యం ఎంతుంటుందో.. చాద‌స్తం అంత‌కు మించి ఉంటుంది. చ‌దువు, సంస్కారంతో పాటు కుల కంపు, మ‌త గ‌జ్జి కూడా వెంటే ఉంటాయి. బంక ప‌ట్టుకున్న‌ట్టుగా వారిని వ‌దిలి వెళ్ల‌వు. అప్పుడ‌ప్పుడు అవి ఇలా మ‌రీ బ‌ట్ట‌లిప్పుకుని తిరుగుతూ నేత‌ల లోప‌లి రంగును బ‌ట‌య‌పెడుతూ ఉంటాయి. ఏపీలో అంతే.. ఏపీలో అంతే.. అని మ‌నం అనుకోవాలంతే!

Related News

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

సీఎం కోట ముందు కవిత ఛాలెంజ్‌….నేను బహుజన బాణాన్ని.. ఏ పార్టీకి తొత్తును కాదు..!

కానరాని వైష్ణవిలెందరో..!? ప్రతీకార హత్యలకు కారకులెవరు? వెన్నుతట్టి ప్రోత్సహించిన నెటిజన్లది! రెచ్చగొట్టిన జనానిది..!

ఆ ఎమ్మెల్యేది క్రెడిట్‌ చోరీ కాదు.. జనం దిల్‌ చోరీ..! మన తెలుగు నేతల లెక్క క్రెడిట్‌ కోసం కొట్టుకోలేదు.. ప్రతిపక్షానికే క్రెడిట్‌ ఇచ్చిన వైనం..!

Big Stories

Advertisement
×