Daryll Cullinan Warns Vaibhav: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ఒకటే పేరు సోషల్ మీడియాలో, ఇటూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వినిపిస్తోంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధానంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంత చిన్న వయసులో అంత భయంకరంగా బ్యాటింగ్ ఎలా చేస్తున్నాడని అందరూ షాక్ అవుతున్నారు. ఎవరు ఊహించని విధంగా వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi) బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో, అతన్నీ మెచ్చుకుంటున్నారు. మరికొంతమంది వైభవ్ సూర్యవంశీని తిట్టేవారు కూడా ఉన్నారు. ఇలాంటి క్రమంలో శ్రీలంకపై 94 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డారిల్ కల్లినన్ ( Daryll Cullinan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తే, ప్రాణాలకే ముప్పు అంటూ హెచ్చరించారు. సచిన్ లాంటి క్రికెటర్లే గాయాల బారిన పడ్డారని.. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ కూడా అలా ఇబ్బంది పడే ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి నుంచి బాడీ ఫిట్నెస్ మైంటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో డారిల్ కల్లినన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అత్యంత భయంకరంగా ఆడుతున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ ( Daryll Cullinan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అద్భుతంగా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీని మెచ్చుకుంటూ… అతనికి కొన్ని సూచనలు చేశారు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు 15 సంవత్సరాలు మాత్రమేనని… ఇలాంటి సమయంలో జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలని కోరారు. వైభవ్ కండరాలు అలాగే కీళ్లు, లిగమెంట్లు ఎదగాల్సిన సమయం ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ లేత వయసులో.. భారీ షాట్లు ఆడి, ప్రాణాలపైకి తెచ్చుకోకూడదని వార్నింగ్ ఇచ్చారు.
బలంగా షాట్లు కొట్టడం వల్ల… తన కండరాలపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్. ఇలా నిరంతరం అతివేగంగా బ్యాట్ స్వింగ్ చేయడం వల్ల, వైభవ్ మణికట్టు, మోచేతులు ఇతర కీళ్ల పై ప్రభావం చూపిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అలా ఆడితే 20 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ కెరీర్ క్లోజ్ కావడం గ్యారంటీ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా టెన్నిస్ ఎల్బో గాయం బారిన పడ్డారని.. దాని వల్ల 2004లోనే సచిన్ కెరీర్ ముగుస్తుందని అందరూ అనుకున్నట్లు గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి వైభవ్ తెచ్చుకోకూడదని కోరారు. దీంతో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.