Ivy Gourd: దొండకాయలను తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్ ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణవ్యవస్థలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడంలో కూడా హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయట. దీంతో పాటు ఫైబర్ అధికంగా ఉండడంతో దొండకాయలు బరువు తగ్గించేందుకు సహకరిస్తాయి. ఫైబర్ కంటెంట్ వల్ల కొంచం తినగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుందట. దీంతో అతిగా తినడాన్ని తగ్గిస్తుందట. శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడేందుకు కూడా ఇవి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దొండకాయ వల్ల బ్రెయిన్‌పై ఎఫెక్ట్?
అయితే దొండకాయలు అతిగా తినడం వల్ల మెదడు మొద్దబారిపోతుందని చెప్పడం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం. అంతేకాకుండా వీటిని అతిగా తీసుకోవడం వల్ల చదువు రాదని కూడా చాలా మంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దొండకాయ తినడం వల్ల శరీరానికి ఏ ఇబ్బంది ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు. దొండకాయ తినడం వల్ల మెదడు మొద్దబడిపోవడం అనే విషయం సైన్స్ పరంగా తప్పు అని అంటున్నారు.
బెండకాయ తింటే లెక్కలు వస్తాయా..?
మరోవైపు బెండకాయలను ఎక్కువగా తినడం వల్ల బ్రెయిన్ షార్ప్‌గా మారుతుందని కూడా అంటారు. వీటిని తరచుగా తీసుకునే ఆహారంలో చేర్చుకోవడం వల్ల లెక్కలు బాగా వస్తాయనే అని చెప్తారు. వీటిని తినడం వల్ల నిజంగానే మెదడు పనితీరుపై ఏదైనా ప్రభావం పడుతుందా అనే అంశంపై చాలా పరిశోధనలు జరిగాయి.
ఇక బెండకాయ తినడం వల్ల కూడా బ్రెయిన్‌పై ఏదో ఎఫెక్ట్ పడుతుందని అనుకోవడం భ్రమ అనే పరిశోధకులు చెబుతున్నారు. బెండకాయ బ్రెయిన్‌కి ఏదో సూపర్ ఫుడ్ లాగా పని చేస్తుందని అనుకోవడం అమాయకత్వం అని నిపుణులు సైతం చెబుతున్నారు. వీటిని తింటే ఏదో మ్యాజిక్ జరిగి మ్యాథ్స్ బాగా వస్తుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని అంటున్నారు.
ALSO READ: సమ్మర్‌లో ఫ్రిజ్ సరిగా పని చేయడం లేదా..?
మెదడు పనితీరుపై దొండకాయ గానీ బెండకాయ గానీ ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని పరిశోధకులు చెబుతున్నారు. దొండకాయలో పౌష్టిక విలువలు, విటమిన్ సి, ఫైబర్, మినరల్స్ ఉంటాయట. ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.