Glenn Phillips: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals vs Gujarat Titans) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చివరి వరకు పోరాడిన గుజరాతి టైటాన్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా గుజరాత్ డేంజర్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ చేసిన ఫీల్డింగ్ వైరల్ గా మారింది. చేజింగ్ సమయంలో కే ఎల్ రాహుల్ బౌండరీ గేటు వద్దకు భారీ షాట్ ఆడాడు. అయితే ఈ సందర్భంగా గాల్లోకి ఎగిరి మరి ఆ బంతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు గ్లెన్ ఫిలిప్స్ ( Glenn Phillips ). క్యాచ్ మిస్సయింది కానీ అతని ప్రయత్నం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు వీడు మనిషి కాదు, సూపర్ మాన్ అమ్మ మొగుడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read: Tanveer Ahmed: వైభవ్ పచ్చి మోసగాడు…వాడి ఏజ్ ఒక్కటే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా రియల్ హీరోగా మారిపోయాడు గ్లెన్ ఫిలిప్స్. తన వద్దకు వచ్చిన ప్రతి బంతిని బౌండరీ లేదా సిక్సర్ వెళ్లకుండా 100కు 200 శాతం ప్రయత్నించాడు గ్లెన్ ఫిలిప్స్. ముఖ్యంగా కేఎల్ రాహుల్ బౌండరీ గేటు వద్దకు కొట్టిన ఓ బంతిని గాల్లోకి ఎగిరి అందుకునే ప్రయత్నం చేశాడు గ్లెన్ ఫిలిప్స్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఒక్క ఇంచు ముందుకు డైవ్ చేసి ఉంటే, అదిరిపోయే క్యాచ్ కూడా అందుకునేవాడు. కానీ కొంచెంలో మిస్సయింది. అయినప్పటికీ అతని ప్రయత్నం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఒక్కటే కాదు.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూజిలాండ్ తరఫున కూడా అనేకసార్లు ఇలాంటి ఫీట్స్ చేశాడు. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ కొట్టిన ఓ షాట్ ను అందుకొని, పెవీలియన్ కు పంపాడు. ఆ సంఘటన కూడా అప్పట్లో హార్ట్ టాపిక్ అయింది.
గ్లెన్ ఫిలిప్స్ న్యూజిలాండ్ ఆటగాడు. ఇతడు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తాడు. ముఖ్యంగా ఫీల్డింగ్ అదరగొడతాడు. ఓవరాల్ గా ఆల్ రౌండర్ అన్నమాట. 2017 నుంచి న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెటర్ ఆడుతున్నాడు. టెస్టులు, టీ20లు, వన్డేలు కూడా ఆడతాడు. ఐపీఎల్ లో మొదట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన గ్లెన్ ఫిలిప్స్, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నారు. రూ.2 కోట్లు పెట్టి, గెన్ ఫిలిప్స్ ను గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది.
Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభవ్ 6 బంతుల్లో ఆరు సిక్సరు కొడతాడు
?igsh=MTl5NmhqcnZ3ODVxMg==
సూపర్మ్యాన్ అనుకున్నారా… 🦸♂️
కాదు, అది గ్లెన్ ఫిలిప్స్ 🙌💪#TATAIPL 2026 | #DCvGT | LIVE NOW 📺 చూడండి | మీ Star Sports తెలుగు & 📱 JioHotstar లో pic.twitter.com/2nF4g1r8n8
— StarSportsTelugu (@StarSportsTel) April 8, 2026