PBKS VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా ప్రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ టోర్నమెంట్లో నాలుగు మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ఇవాళ ఐదవ మ్యాచ్ కొనసాగుతోంది. ఈ ఐదవ మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Gujarat Titans vs Punjab Kings ) మధ్య… బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్… భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు నష్టపోయిన పంజాబ్ కింగ్స్… 243 పరుగులు చేసింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 244 పరుగులు చేస్తే పంజాబ్ జట్టు పైన గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తుంది.
Also Read: Rishabh Pant: రూ. 27 కోట్లు తీసుకుని ఒక్క స్టంప్ చేయలేదు.. పంత్ పై ట్రోలింగ్ !
శ్రేయస్ అయ్యార్ వీర విహారం
పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్…. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer ) వీర విహారం చేశాడు. ఇవాళ జరిగిన మ్యాచ్లో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ… జట్టుకు మంచి స్కోర్ అందించాడు యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. 42 బంతుల్లోనే 97 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు కొట్టాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఐపీఎల్ మెగా వేలంలో 27 కోట్లు పలికిన రిషబ్ పంత్ డక్ అవుట్ అయితే… అతని తర్వాత రికార్డు స్థాయిలో ధర పలికిన శ్రేయస్ అయ్యర్ మాత్రం 97 పరుగులతో రాణించాడు. 230 స్ట్రైక్ రేట్ తో 97 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్.
మంచి ఫినిషింగ్ ఇచ్చిన శశాంక్ సింగ్
పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేయర్ శశాంక్ సింగ్ ( Shashank Singh ) మరోసారి దుమ్ము లేపాడు. 16 వంతుల్లోనే 44 పరుగులు చేశాడు శశాంక్ సింగ్. ఇందులో రెండు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. ఏకంగా 275 స్ట్రైక్ రేట్తో… గుజరాత్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు శశాంక్ సింగ్. అటు పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 23 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. ఇతను కూడా 204 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు. ప్రబ్ సిమ్రాన్ ఐదు పరుగులు చేయగా అజ్మతుల్లా 16 పరుగులు చేసి విఫలమయ్యారు.
Also Read: PBKS VS GT: బౌలింగ్ చేయనున్న గుజరాత్.. భారీ మార్పులతో పంజాబ్
ఇక డేంజర్ ఆటగాడు మ్యాక్స్ వెల్ మరోసారి విఫలమయ్యాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన సమయంలో… గత ఏడాది దారుణంగా విఫలమయ్యాడు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చినా కూడా… మ్యాక్సీ మామ ఆట తీరు ఏమాత్రం మారలేదు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 244 పరుగులు చేస్తే పంజాబ్ పైన గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తుంది. గుజరాత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు… 10 ఓవర్ల వరకు నిలబడితే… మ్యాచ్ సులభంగా గెలవచ్చు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్.. టచ్ లోకి వస్తే.. కచ్చితంగా గుజరాత్ విజయం సాధ్యమవుతుంది.