BigTV English

SRH VS GT: బ్యాటింగ్ చేయనున్న SRH.. కాటేరమ్మ కొడుకులు ఉంటారో… పోతారో

SRH VS GT: బ్యాటింగ్ చేయనున్న SRH.. కాటేరమ్మ కొడుకులు ఉంటారో… పోతారో

SRH VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో  ( Indian Premier League 2025 Tournament )  భాగంగా ఇవాళ హైదరాబాద్ మ్యాచ్ జరగబోతోంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ( Gujarat Titans vs Sunrisers Hyderabad ) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ( Rajiv Gandhi International Stadium, Hyderabad )… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య 19వ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కాసేపటి క్రితమే టాస్ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.


Also Read: Jofra Archer: అండర్టేకర్ లాగా నిద్ర లేచి..పంజాబ్ ను కూల్చేశాడు ?

మ్యాచ్ టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలి?


ఇండియన్ ప్రీమియర్ లీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జరుగుతున్న సన్రైజర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో ఉచితంగా మనం చూడవచ్చు. జియో హాట్ స్టార్ లోనే కాకుండా… స్టార్ స్పోర్ట్స్ లో కూడా… ఈ మ్యాచ్ తిలకించవచ్చు.

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల రికార్డులు

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల ( Gujarat Titans vs Sunrisers Hyderabad ) మధ్య గత రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచులు మాత్రమే జరిగాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ ఏకంగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒకే ఒక్క మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఒక మ్యాచ్ లో రిజల్ట్ రాలేదు. ఇక చిట్టచివరగా హైదరాబాద్ పైన గుజరాత్ విజయం సాధించింది. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన గుజరాత్ టైటాన్స్… 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఇవాళ్టి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుస్తుందో లేదో చూడాలి.

Also Read: Pakistan: పాకిస్థాన్ టీంలో ముసలం.. ఫ్యాన్స్, క్రికెటర్స్ దారుణంగా కొట్టుకున్నారు ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ VS  గుజరాత్ టైటాన్స్ జట్ల వివరాలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(w), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (c), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (C), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×