Dhanashree Verma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… మ్యాచులన్నీ చాలా రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో… టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కు ( Team India cricketer Yuzvendra Chahal ) ఊహించని షాక్ ఇచ్చింది ఆయన మాజీ భార్య ధనశ్రీ వర్మ. విడాకులు మంజూరు కావడంతో వెంటనే హైదరాబాద్ వచ్చేసింది ధనశ్రీ వర్మ. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ధనశ్రీ వర్మ పోస్ట్ పెట్టడం జరిగింది. నమస్కారం హైదరాబాద్… మళ్లీ మిమ్మల్ని కలుస్తున్నాను… నన్ను ఆశీర్వదించండి అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది ధనశ్రీ వర్మ.
Also Read: Ashwani Kumar: ఆటో ఛార్జీకి రూ.30 అడిగేవాడు.. కానీ ఇప్పుడు ముంబైని ఏలుతున్నాడు !
ఈ పోస్టులో… ఏదో షూటింగ్ స్పాట్లో తాను ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. ఈ షూటింగ్ స్పాట్ లో… ధన శ్రీ వర్మ కు ( Dhanashree Verma ) మేకప్ చేస్తున్నారు కొంతమంది. ఇక లంచ్ సమయంలో దాదాపు పది రకాల వంటకాలను ఆమె.. తినడాన్ని కూడా పోస్టు ద్వారా చూపించింది. దీంతో అందరూ ఆమె ఓ షూటింగ్స్ స్పాట్లో ఉందని… కామెంట్స్ చేస్తున్నారు. అతి త్వరలోనే ధనశ్రీ వర్మ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందని మొన్నటి వరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఆ వార్తలను నిజం చేస్తూ… ధన శ్రీ వర్మ తాజాగా పోస్ట్ చేయడం జరిగింది. ఆమె సినిమా పేరు చెప్పలేదు కానీ… షూటింగ్ స్పాట్ లో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ కూడా వచ్చినట్టు వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఓ ఫ్లాట్లో ఉంటుందట ధనశ్రీ వర్మ. ఎవరికి తన ఫేస్ తెలియకుండా మాస్క్ వేసుకుని తిరుగుతుందట. షూటింగ్ సమయంలో సిటీ అవుట్ కు ధన శ్రీ వర్మ వెళ్తూ ఉందట. అయితే తాజాగా ఆమె చేసిన పోస్టులో… చాలా గ్లామరస్ గా కనిపించింది ధనశ్రీ వర్మ.
Also Read: Rishabh Pant: 27 కోట్లు తీసుకున్నాడు కానీ.. 27 పరుగులు కూడా చేయలేదు ?
చాహల్ తో ధన శ్రీ వర్మ విడాకులు
టీమిండియా యంగ్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అలాగే మోడల్ ధనశ్రీ వర్మ… ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 సంవత్సరంలో వీళ్ళిద్దరూ… రెండు కుటుంబాల సమక్షంలోనే ఒకటయ్యారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు… లైఫ్ ఎంజాయ్ చేసిన ధన శ్రీ వర్మ అలాగే యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ విడిపోయారు. 2022 సంవత్సరం నుంచి విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఒకరి ఫోటోలు మరొకరు డిలీట్ కూడా చేశారు. ఇక తాజాగా కోర్టులో విడాకులు కూడా మంజూరు అయ్యాయి. ఈ తరుణంలో 4.75 కోట్లు.. భరణంగా ధనశ్రీ వర్మ కు టీమిండియా యంగ్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఇవ్వడం జరిగింది. టీమిండియా యంగ్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అలాగే మోడల్ ధనశ్రీ వర్మ…విడాకులు అంశం వైరల్ ఐన తరుణంలోనే ధనశ్రీ వర్మ..ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది.