BigTV English
Advertisement

LSG VS GT: ఒకే ఒక్క మ్యాచ్.. 6 మంది ప్లేయర్లకు గాయాలు.. ఇదేం గ్రౌండ్ రా ?

LSG VS GT: ఒకే ఒక్క మ్యాచ్.. 6 మంది ప్లేయర్లకు గాయాలు.. ఇదేం గ్రౌండ్ రా ?

LSG VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ఇప్పటివరకు 64 మ్యాచ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన లక్నో సూపర్ జెంట్స్.. గ్రాండ్ విక్టరీ కొట్టింది. గుజరాత్ టైటాన్స్ జట్టుపైన ఏకంగా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంలో… లక్నో ఓపెనర్ మిచెల్ మార్ష్ కృషి ఎంతో ఉందన్న సంగతి తెలిసిందే. సెంచరీ తో దుమ్ము లేపి.. గుజరాత్ జట్టును మట్టికరిపించాడు.


Also Read: LSG VS GT: దిగ్వేశ్ పోయాడు.. లక్నోలో మరొకడు తగిలాడు..నోట్ బుక్ సిగ్నచర్ సెలెబ్రేషన్స్ చేస్తూ

ఒకే ఒక్క మ్యాచ్ ఆరుగురు ప్లేయర్లకు గాయాలు


గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన 64వ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఏకంగా ఆరుగురు ప్లేయర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ లిస్టులో… మహమ్మద్ సిరాజ్, లక్నో ఓపెనర్ మార్ష్ , గుజరాత్ వికెట్ కీపర్ బట్లర్, హర్షద్ ఖాన్, రూథర్ఫర్డ్ లాంటి వాళ్ళు ఉన్నారు. చాలామందికి గాయాలయ్యాయి కానీ… వీళ్లు మాత్రం… కీలకంగా మారారు. ముఖ్యంగా ఆకాష్ సింగ్ అనే లక్నో బౌలర్… చేతికి అయితే రక్తమే వచ్చింది. గుజరాత్ ఆటగాడు.. స్టేట్ డ్రైవ్ ఆడగా… బౌలింగ్ వేసిన ఆకాష్ సింగ్… ఆ బంతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో చేతికి బ్లీడింగ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నరేంద్ర మోడీ స్టేడియం పై విమర్శలు

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం పైన ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ ఆడితే కచ్చితంగా ప్లేయర్లకు గాయాలు అవుతున్నాయని.. పిచ్ మెయింటెనెన్స్ సరిగా.. ఉండటం లేదని నేటిజన్స్ ఆరోపణలు. గుజరాత్ జట్టు బౌలర్ హర్షద్ ఖాన్… బౌలింగ్ వేస్తూ ఏకంగా రెండుసార్లు కింద పడిపోయాడు. తన కాలు స్లిప్ కావడంతో… సడన్ గా కింద పడిపోయాడు. ఈ వీడియో ఒక్కటి బాగా వైరల్ అయింది. దీంతో నరేంద్ర మోడీ స్టేడియం పై విమర్శలు విపరీతంగా వస్తున్నాయి. ఇకనైనా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని… బాగు చేయాలని కోరుతున్నారు. లేకపోతే అక్కడ మ్యాచ్లు నిర్వహించకుండా చూడాలని సెటైర్లు పేల్చుతున్నారు.

పాయింట్లు పట్టికలో ఇప్పటికి కూడా గుజరాత్ నెంబర్ వన్

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో… గిల్ సేన ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లీడింగ్ లో ఉంది. ఇక.. మూడో స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉండగా… చివరగా ముంబై ఇండియన్స్ ఉంది.

Also Read: IPL players :పంజాబ్ దరిద్రాన్ని ఢిల్లీకి పట్టించారా.. ఈ 4 గురు ప్లేయర్లు అడుగుపెడితే సర్వనాశనమేనా..?

 

Related News

IND vs PAK: పాకిస్తాన్ కొంప ముంచిన వ‌ర్షం..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sree Charani : శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా.. గ్రూప్-1 జాబ్, రూ.2.5 కోట్లు, ఇంటి స్థలం

Hong Kong Sixes 2025: 6, 6, 6, 6, 6, 6 పాకిస్తాన్ ప్లేయ‌ర్ విధ్వంసం..6 బంతుల్లో 6 సిక్స‌ర్లు..వీడియో వైర‌ల్‌

Shivam Dube: హ‌ర్షిత్ రాణా కోసం శివమ్ దూబే కెరీర్ నాశనం..బ‌ల‌వంతంగా బ్యాటింగ్ చేయిస్తున్న గంభీర్‌

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

Big Stories

×