BigTV English

GT vs DC IPL 2024 Preview: ఇద్దరికి గెలుపు ముఖ్యమే.. నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్

GT vs DC IPL 2024 Preview: ఇద్దరికి గెలుపు ముఖ్యమే.. నేడు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
Gujarat Titans vs Delhi Capitals IPL 2024 Prediction: ఐపీఎల్ సీజన్ 2024లో రెండు జట్లకు గెలవక తప్పని పరిస్థితి ఎదురైంది. అవే నేడు తలపడనున్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. రాత్రి 7.30కి అహ్మదాబాద్ లో వీరి మధ్య మ్యాచ్ జరగనుంది. ఇంతవరకు 3 మ్యాచ్ లు గెలిచి 3 ఓడిన గుజరాత్ పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ అయితే 6 మ్యాచ్ లు ఆడి 2 మాత్రమే గెలిచి, నాలుగింట ఓటమి పాలైంది. పాయింట్ల టేబుల్ లో 8వ ప్లేస్ లో ఉంది.

ఈ రెండు జట్ల మధ్య ఇంతవరకు 3 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గుజరాత్ రెండింట్లో విజయం సాధించింది. ఢిల్లీ ఒక మ్యాచ్ గెలిచింది.


రెండు జట్ల బలాబలాలను చూస్తే శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ దూకుడుగా లేదు. ఫర్వాలేదన్నట్టు ఆడుతోంది. గిల్ ఆడితేనే మ్యాచ్ అన్నట్టుగా ఉంది.  వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, ఓమర్ జాయ్ వీరెవరూ ఇంకా బ్యాట్ ఝులిపించ లేదు.

GT vs DC IPL 2024
GT vs DC IPL 2024

బౌలింగ్ బలంగా ఉండటం వల్లే, ఆ మూడు మ్యాచ్ లైనా గుజరాత్ గెలిచిందని చెప్పాలి. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, ఓమర్ జాయ్ వీరందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు.


ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఇంకా పుంజుకున్నట్టు కనిపించలేదు. ఒకవైపు నుంచి బ్యాటర్లు పరుగులు తీస్తుంటే, కీపర్ కమ్ కెప్టెన్ అయిన పంత్ వెంటనే ఫీల్డింగ్ సెట్ అప్ మార్చడం, లేదా సీనియర్ల సలహాలు తీసుకుని ఆలోచనలు చేయడం, బ్యాటర్లకు తగినట్టుగా బౌలింగ్ వనరులు వినియోగించడం లాంటివి చేయడం లేదు.

ప్రత్యర్థులు కొడుతుంటే, ఒక కామన్ మేన్ లా తను కూడా అలా చూస్తూ గడిపేస్తున్నాడు. కొద్దిగా కెప్టెన్సీ వ్యూహాలకు పంత్ పదును పెట్టాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

ప్రథ్వీ షా, డేవిడ్ వార్నర్, అభిషేక్ , ట్రిస్టన్ స్టబ్స్ వీరందరూ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డారు. రిషబ్ పంత్ తన గేమ్ తను ఆడుతున్నాడు. బౌలింగ్ కూడా వీక్ గా ఉంది. మరి రెండు జట్లు వారి బలహీనతలను దాటి ఎవరు గెలిచి ముందడుగు వేస్తారో వేచి చూడాల్సిందే.

Tags

Related News

OLYMPICS 2036 : 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్.. కావ్య పాప, సంజీవ్ తో రేవంత్ భారీ ప్లాన్

Nivetha Pethuraj: టీమిండియా ప్లేయర్ తో రిలేషన్.. ఇప్పుడు మరో వ్యక్తితో !

Arjun Tendulkar : ఎంగేజ్మెంట్ తర్వాత… గుళ్ల చుట్టూ తిరుగుతున్న సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ.. సానియా జోష్యంలో దోషముందా?

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

CSK Vs RCB : అరేయ్ ఏంట్రా ఇది… గణపతి విగ్రహాలతో CSK vs RCB మ్యాచ్… వీడియో చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Oshane Thomas : ఒకే ఒక్క బంతికి 15 పరుగులు, మరోసారి 22 పరుగులు… ఎవడ్రా ఈ థామస్.. ఇంత చెత్త బౌలింగ్ ఏంటి

Big Stories

×