BigTV English

Nidhhi Agerwal: ‘రాజా సాబ్’ సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ

Nidhhi Agerwal: ‘రాజా సాబ్’ సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ

Nidhhi Agerwal joins the shoot of The Raja Saab: ప్రస్తుతం పాన్ ఇండియ స్టార్ ప్రభాస్ పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అందులో ‘రాజా సాబ్’ సినిమా ఒకటి. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధఇ అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి లీకైన ఫొటోలు అభిమానుల్ని ఫుల్ ఖుషీ చేయగా.. మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించారు.


ఆ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. లుంగి కట్టుకుని ఆరడుగుల ఆటంబాబ్ నడిసొస్తుంటే.. ఆ ఆనందం చెప్పలేనిదంటూ ఆ మధ్య కామెంట్లు వినిపించాయి. ఈ పోస్టర్ అప్డేట్ తర్వాత ఈ మూవీకి సంబంధించి అప్పట్నుంచి మరే ఇతర అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించలేదు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే మాళవిక మోహనన్‌పై పలు సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించారు. అయితే ఇప్పుడు ఈ మూవీ షూటింగ్‌ తాజా షెడ్యూల్‌లో మరో హీరోయిన్‌ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ తాజాగా సెట్స్‌లో అడుగు పెట్టినట్లు సమచారం. ఈ తాజా షెడ్యూల్‌ని మేకర్స్ హైదరాబాద్‌లో ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది.


Also Read: నేను ప్రభాస్‌కు ట్రూ లవర్‌: దర్శకుడు మారుతి

అయితే ఇదే షెడ్యూల్‌లో ప్రభాస్ త్వరలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో కొన్ని సీన్లను చిత్రీకరించనున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి. ఇకపోతే ఈ మూవీ కోసం దర్శకుడు మారుతీ సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి హారర్‌ను కాస్త అటాచ్ చేస్తూ.. భారీ గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్‌తో సినిమాను మరో రేంజ్‌కి తీసుకెళ్లాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే.. సెకండాఫ్‌లో ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అంతలా సినిమాలో హారర్‌తో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయట మరి.

ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×