PBKS VS GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ మరో రసవత్తర మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో 4 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్ లన్నీ ఉత్కంఠ భరతంగానే జరిగాయి. ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Gujarat Titans vs Punjab Kings ) 5వ మ్యాచ్ జరుగనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium in Ahmedabad ) వేదికగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 5వ మ్యాచ్ జరుగనుంది.
Also Read: Deepak Chahar’s sister Post: దీపక్ చాహర్‌పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి… బాహుబలిలోని కట్టప్ప అంటూ !
మ్యాచ్ టైమింగ్స్ , ఉచితంగా ఎలా చూడాలి ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా ఇవాళ జరిగే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 5వ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 7 గంటలకు టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇక గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 5వ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. జియో కస్టమర్లందరూ ఉచితంగానే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ 5వ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో చూడొచ్చు. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం విషయానికి వస్తే… మొదట బ్యాటింగ్ చేస్తే.. చాలా అడ్వాంటేజ్ ఉంటుంది.
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ రికార్డులు
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు జరిగాయి. ఈ ఐదు మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఏకంగా మూడు మ్యాచ్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచ్లు విజయం సాధించడం జరిగింది. అయితే… విన్నింగ్ పర్సెంట్ చూస్తే గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్లో 60% గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారు. అటు పంజాబ్ 40 శాతం మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి పంజాబ్ కు కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ రావడంతో… ఆ జట్టుపై మరింత అంచనాలు పెరిగాయి. మరి ఏ జట్టు గెలుస్తుందో చూడాలి.
Also Read: Harbhajan Singh – Jofra Archer: ఆర్చర్‌పై భజ్జీ జాత్యహంకార కామెంట్స్… బ్లాక్ టాక్సీ మీటర్!
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల అంచనా
గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XII: శుభమన్ గిల్ (సి), జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్
పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ XII: శ్రేయాస్ అయ్యర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, నేహాల్ వధేరా/సూర్యాంష్ షెగ్డే, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ చాహల్ మరియు యుజ్‌వేంద్ర చాహల్,