WTC Final 2025: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ( ICC World Test Championship Final 2025 ) ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. మొదట దక్షిణాఫ్రికా పై చేయి సాధించగా… ఇప్పుడు బౌలింగ్ లో కంగారులు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్నారు. లండన్ గడ్డ పైన… దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు ఆస్ట్రేలియా ప్లేయర్లు. దీంతో 40 పరుగులు పూర్తికాకముందే నాలుగు వికెట్లు కోల్పోయింది దక్షిణాఫ్రికా. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించకపోవడంతో… దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నరకం చూస్తున్నారు.
Also Read: MS Dhoni: MS ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ఇప్పుడే అసలు గౌరవం
లార్డ్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ లండన్ లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయడంతో.. దక్షిణాఫ్రికా బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆస్ట్రేలియా అంచనాలకు.. ఏ మాత్రం అందకుండా దక్షిణాఫ్రికా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ఈ నేపథ్యంలోనే 56.4 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా టీం… 212 పరుగులు చేసి కుప్ప కూలింది. స్టీవెన్ స్మిత్ అలాగే వెబ్ స్టార్ ఇద్దరు తప్ప అందరూ ఆటగాళ్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఈ మ్యాచ్ లో ముగ్గురు డక్ అవుట్ కావడం విశేషం. ఇందులో ఉస్మాన్ కవాజా కూడా ఉన్నాడు.
ఆస్ట్రేలియాను ఆదుకున్న స్టీవెన్ స్మిత్ , వెబ్ స్టార్
కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అలాగే వెబ్ స్టార్ ఇద్దరూ కూడా ఆదుకున్నారు. ఈ మ్యాచ్ లో స్టీవెన్ స్మిత్ 112 బంతులు ఆడి 66 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందులో 10 బౌండరీలు ఉన్నాయి. ఆ తర్వాత ఆరవ వికెట్ కు వచ్చిన వెబ్ స్టార్ 92 బంతుల్లోని 72 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో 11 బౌండరీలు ఉన్నాయి. ఇక మిగతా ప్లేయర్లు ఆడకపోయినా ఈ ఇద్దరు ప్లేయర్లు జట్టుకు ఆసరాగా నిలిచారు.
Also Read: Tino Best: 650 మంది మహిళలతో శృ***గారం.. ఆ వెస్టిండీస్ క్రికెటర్ టినో బెస్ట్ అరాచకాలు
చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు
ఆస్ట్రేలియా జట్టును ( Australia Team)తక్కువ పరుగులకు అలౌడ్ చేసి మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ప్లేయర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు. ఇవాళ మొదటి రోజు ముగిసే సమయానికి 22 ఓవర్లు ఆడిన సౌత్ ఆఫ్రికా (South Africa ) నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ సందర్భంగా కేవలం 43 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా 37 బంతుల్లో మూడు పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే డేవిడ్ బెడింగం 9 బంతుల్లో 8 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐడెన్ మార్క్రం డక్ అవుట్ కాగా… రియాన్ రికెల్టన్ 16 పరుగులు చేశాడు. మల్డర్ ఆరు పరుగులు చేయగా స్టబ్స్ రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు.