Irfan Pathan Reaction On MS Dhoni’s run-out: టీమిండియా కెప్టెన్ గా మహేంద్రసింగ్ ధోని ( MS Dhoni) ఎన్నో విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. 2007, 2011 వరల్డ్ కప్ తో పాటు 2013లో ఛాంపియన్ ట్రోఫీని కూడా మహేంద్రసింగ్ ధోని టీమిండియా జట్టుకు అందించాడు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ధోనిపి కించపరుస్తూ మాట్లాడుతూనే ఉంటారు. అప్పట్లో ధోని కెప్టెన్సీలో ఆడిన క్రికెటర్లే ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. ధోని పై బురద జల్లుతూ ఉంటారు.
విరాట్ కోహ్లీకి మంచి పేరు రాకుండా మహేంద్రసింగ్ ధోని కుట్రలకు తెరలేపాడని తాజాగా ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan) సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ సమయంలో ధోని సెమీ ఫైనల్స్ లో (2019 World Cup semifinal) రనౌట్ అయి టీమిండియా కొంప ముంచాడని మండిపడ్డారు. ఆ మ్యాచ్ లో ధోని రన్ అవుట్ కాకపోయి ఉంటే టీమిండియా ఫైనల్స్ కు వెళ్లి టైటిల్ కూడా గెలిచేదని వ్యాఖ్యానించారు. టైటిల్ గెలిస్తే కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీకి పేరు వస్తుందని ధోని కావాలనే రనౌట్ అయినట్లు ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు చిచ్చు రాజేస్తున్నాయి.
2019 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా సెమీ ఫైనల్ దాకా వెళ్లి ఎలిమినేట్ అయింది. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా తలపడింది. ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ తో పడితే కచ్చితంగా టీమిండియానే ఓడిపోతుందన్న సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ ను మరోసారి రుజువు చేస్తూ 2019లో కూడా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ మొదటి బ్యాటింగ్ చేయక.. 239 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా తడబడి ఓడిపోయింది. అయితే ఇందులో మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్ గా 50 పరుగులు చేసి రాణించాడు. కానీ 50 పరుగులు పూర్తయిన తర్వాత రన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రవీంద్ర జట్టు డీల్ చేయలేక వదిలేసాడు. అదే ధోని ఉండి ఉంటే మ్యాచ్ టీమ్ ఇండియా గెలిచేది. కానీ న్యూజిలాండ్ గెలిచి ఫైనల్ కి వెళ్ళింది.