Hardik blames Bumrah: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో రాజస్థాన్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది ముంబై ఇండియన్స్. ఈ రెండు ( Rajasthan Royals vs Mumbai Indians) జట్ల మధ్య నిన్న అస్సాంలోని గౌహతి ( Barsapara Cricket Stadium, Guwahati) వేదికగా బిగ్ ఫైట్ జరిగింది. వర్షం కారణంగా మ్యాచును 11 ఓవర్లకు కుదించేశారు. దీంతో చాలా భయంకరంగా ఆడిన రాజస్థాన్, విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.బుమ్రా ( Bumrah) నేతృత్వంలోని బౌలింగ్ అటాక్ తమ ఓటమికి కారణమని బాంబు పేల్చారు. తమ బౌలర్లను 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi) ఉతికారేశాడని, పరోక్షంగా బుమ్రాను అవమానిస్తూ మాట్లాడాడు పాండ్యా. దీంతో పాండ్యా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు వెనుక కుట్రలు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భయంకరంగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్లు విపరీతంగా పరుగులు ఇచ్చారు. ఒక్కో బౌలర్ 30కి పైగానే పరుగులు ఇవ్వడం గమనార్హం. హార్దిక్ పాండ్యా మాత్రం రెండు ఓవర్లు వేసి 17 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. బుమ్రా 3 ఓవర్లు వేసి 32 పరుగులు ఇవ్వడం మ్యాచును టర్న్ తిప్పింది. అంతేకాదు వైభవ్ సూర్య వంశీ కూడా బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి పరువు తీశాడు.
అయితే ముంబై ఇండియన్స్ ఓడిపోయిన తర్వాత హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుమ్రా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ బౌలింగ్ చెత్త ప్రదర్శన కనబరిచిందని.. 15 ఏళ్ల బుడ్డోడు కూడా సిక్సర్లు కొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ చెత్త బౌలింగ్ కారణంగానే ఓటమి పాలైనట్లు వివరించారు. లేకపోతే కచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ పైన గెలిచే వాళ్ళమన్నారు. కేవలం 8 బంతులు సరిగ్గా వేసి ఉంటే ఫలితం వేరే లాగా ఉండేదన్నారు. అంటే పరోక్షంగా బుమ్రాను ఉద్దేశించి హార్దిక్ పాండ్యా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బుమ్రారా అభిమానులు ఫైర్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నాడని.. ఒక్క మ్యాచ్ లో విఫలమైతే బుమ్రాను తిట్టడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, బుమ్రా వేసిన ఓవర్ లో తొలి బంతికే సిక్సర్ కొట్టి, వైభవ్ సూర్య వంశీ పరువు తీశాడు.
Also Read: Farhan – Smith: సింగిల్ తీయకుండా స్మిత్ ను అవమానించిన ఫర్హాన్..బాబర్ పగను తీర్చుకున్నాడుగా