BigTV English

Hardik Pandya: ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న హార్ధిక్ పాండ్య..

Hardik Pandya: ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న హార్ధిక్ పాండ్య..

Hardik Pandya: టీమిండియా స్టార్ ప్లేయర్ హార్థిక్ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో హడావుడిగా పెళ్లి చేసుకున్న పాండ్యా ఈసారి అంగరంగ వైభవంగా తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను వివాహమాడారు. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌కోటలో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది.


మూడేళ్ల క్రితం హార్ధిక్-నటాషాల వివాహం జరిగింది. అయితే ఆసమయంలో కరోనా పీక్స్‌లో ఉండడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. నటాషా గర్భం దాల్చిందని పాండ్యా సోషల్ మీడియాలో ప్రకటించే వరకు వారి పెళ్లి విషయం ఎవరికీ తెలియదు.

ఇక మొదటి నుంచి పెళ్లిని ఘనంగా జరుపుకోవాలని అనుకునే పాండ్యా.. వాలంటైన్ డే సందర్భంగా తన భార్యను మరోసారి వివాహమాడారు. మొదట క్రిస్టియన్ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఉంగరాలు మార్చుకొని ఒక్కటయ్యారు.


ఆ తర్వాత హిందూ సంప్రదాయ పద్ధతిలోనూ పెళ్లి చేసుకున్నారు. బంగారు-ఎరుపు రంగు కలగలిసిన లెహాంగాలో బంగారు ఆభరణాలు ధరించి అచ్చమైన భారతీయ వనితలా మెరిసిపోయింది.. నటాషా. పండితులు వేధమంత్రాలు చదువుతుండగా.. ఈ జంట ఆగ్నిహోత్రం చుట్టూ ఏడడుగులు వేసి ముచ్చటగా మూడోసారి ఒక్కటయ్యారు.

హార్థిక్ వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోగా.. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Big Stories

×