Big Stories

LSG vs MI IPL 2024 Preview: ముంబై కో(మే)లుకుంటుందా? నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్

LSG vs MI IPL 2024 Dream 11 Prediction: ఐపీఎల్ లో అట్టడుగునకు పోయిన జట్లన్నీ తిరిగి రీ ఛార్జ్ అవుతున్నాయి. ఆర్సీబీ, పంజాబ్ ధనాధన్ ఆడి దుమ్ము రేపుతున్నాయి. ముంబై మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆడుతోంది. జట్టులో సమతుల్యత లోపించింది. సమన్వయం కూడా లేదనేది బహిరంగంగానే కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో లక్నోతో ఏక్నా క్రికెట్ స్టేడియంలో నేటి రాత్రి 7.30కి మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

పాయింట్ల పట్టికలో ముంబై అత్యంత ఘోరంగా 9వ స్థానంలో ఉంది. లక్నో మాత్రం 5 వస్థానంలో ఉంది. ముంబై ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 3 మాత్రమే గెలిచింది. లక్నో కూడా 9 మ్యాచ్ లు ఆడింది కానీ 5 గెలిచింది. అయితే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్ లు జరిగాయి. ముంబై ఒకటి గెలిచింది. లక్నో మాత్రం 3 గెలిచి, ఒక అడుగు ముందే ఉంది.

- Advertisement -

ముంబై విషయానికి వస్తే ఓపెనర్లు ఆ జట్టు బలం, వారిద్దరు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ త్వరగా అయిపోవడం జట్టును కలవరపరుస్తోంది. ఇక సూర్య కూడా ఏవో రెండు మ్యాచ్ లు దడదడలాడించాడు. తర్వాత బ్యాట్ సంకలో పెట్టుకుని వెళ్లిపోతున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా ఇన్నాళ్లకి కొద్దిగా టచ్ లోకి వచ్చాడు. తిలక్ వర్మ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

Also Read: కోల్ కతాకి ఎదురే లేదు : ఢిల్లీకి ఘోర పరాజయం

బౌలింగు విషయానికి వస్తే బుమ్రాని సరిగ్గా వాడుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా తనవంతు పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నాడు. ఇకపోతే రొమారియో, హార్దిక్, శ్రేయాస్ గోపాల్, కొయెట్జీ, మహ్మద్ నబీ వీరందరి  బౌలింగు అంతంత మాత్రంగా ఉందనే విమర్శలున్నాయి.

ఇకపోతే లక్నో విషయానికి వస్తే.. ముంబై మీద ఒక మెట్టు పైనున్నా, తను పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆడటం లేదని అంటున్నారు. గెలుస్తున్నారు కానీ, ప్రత్యర్థులు పోరాట పటిమ లేక గెలిచినవే కానీ, దెబ్బాదెబ్బగా పోరాడి గెలిచినవి లేవని అంటున్నారు. అవతల గట్టిగా ఆడితే, వీళ్లు హ్యాండ్సప్ అంటున్నారనే విమర్శలున్నాయి.

క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఎవరో ఒకరు క్లిక్ అయితే మ్యాచ్ ముందుకెళుతోంది. దేవదత్ పడిక్కల్ ఆకట్టుకోలేక పోతున్నాడు. అయినా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మార్కస్ స్టోనిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వీళ్లందరూ పెద్ద స్కోర్లు బాకీ ఉన్నారు.

బౌలింగు విషయానికి వస్తే సిద్ధార్థ్, కృనాల్ పాండ్యా, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోనిస్ ఫర్వాలేదనిపిస్తున్నారు. మరి రెండు జట్లు కూడా నిరాశ నిస్పృహల మధ్యే ఉండటంతో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News