Haris Rauf: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చిన నేపథ్యంలో టీమిండియా జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్ ( Haris Rauf). 2027 వన్డే వరల్డ్ కప్ ( World cup 2027) సందర్భంగా టీమిండియా పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. గతంలో ఇండియా ( Team India) చేతిలో తమ జట్టు ఓడిపోయిందని.. కానీ ఇకపై తాము రివర్స్ అటాక్ చేస్తామని స్పష్టం చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా కచ్చితంగా టీమిండియాను ఓడిస్తామని, అల్లా మీద ఒట్టు వేసి చెబుతున్నట్లు శపథం చేశాడు. ఒకవేళ టీమిండియా పైన పాకిస్తాన్ గెలవకపోతే.. తన పేరు మార్చుకుంటానని కూడా సవాల్ విసిరాడు. దీంతో పాకిస్తాన్ ( Pakistan) స్టార్ బౌలర్ హారిస్ రవూఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే అతడు చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. గతంలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టుకు.. భవిష్యత్తులో మరీ దారుణమైన ఓటమి ఎదురు కావడం గ్యారెంటీ అని చురకలు అంటిస్తున్నారు.
టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉంటాయన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యల నేపథ్యంలో.. ఈ వాతావరణం నెలకొంది. పదే పదే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇండియాలో దాడులకు పాల్పడడం కూడా ఈ మధ్య విపరీతంగా జరుగుతుంది. పహల్గామ్ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. దీని వల్ల టీమిండియా అలాగే పాకిస్తాన్ క్రికెటర్లు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోని పరిస్థితులు ఉన్నాయి. అయితే, ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా చేతిలో పలు సార్లు పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ.. ఆ దేశం క్రికెటర్లకు బుద్ధి రావడం లేదు. ప్రతిసారి ఇండియాకు సవాల్ విసిరి ఓడిపోతూనే వస్తున్న పాకిస్తాన్.. తాజాగా మరో ఛాలెంజ్ విసిరింది.
2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియాను చిత్తుగా ఓడించి.. ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ పాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ సంచలన ప్రకటన చేశారు. అల్లా మీద ఒట్టు వేసి ఈ ఛాలెంజ్ చేస్తున్నానని కూడా పేర్కొన్నారు. ఒకవేళ తాను చెప్పినట్లుగా పాకిస్తాన్ గెలవకపోతే, దేనికైనా సిద్ధం అంటూ వ్యాఖ్యానించారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ తో పాటు ఫైనల్ జరిగినా ఓడించడం మాత్రం తప్పదని హెచ్చరించారు. పాకిస్తాన్ బలం రోజు రోజుకు పెరుగుతోందని… పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బలమైన జట్టును తయారు చేసుకుంటున్నట్లు వివరించారు. ఇక ఈసారి పంజా విసిరితే టీమిండియా అతలాకుతలం కావడం గ్యారెంటీ అంటూ వార్నింగ్ ఇచ్చారు హారిస్ రవూఫ్.