Women’s Asia Cup 2026: ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ (Women’s Asia Cup 2026) ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగునుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ ఫైనల్ అయింది. ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 5వ తేదీన మ్యాచ్ కూడా జరగనుంది. అదృష్టం బాగుంటే ఫైనల్స్ లో మరోసారి మహిళల టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ ఉంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై తాజాగా చర్చ తెరపైకి వచ్చింది. ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, పాక్ దేశానికి సంబంధించిన విలేకరులు ప్రశ్నించారు.అయితే ఈ ప్రశ్నల నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. తాము ఆసియా కప్ ఆడేందుకు వచ్చాం… కానీ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి కాదంటూ కౌంటర్ ఇచ్చారు. క్రికెట్ ఆడడం కోసం తాము వచ్చామని… స్టేడియం బయటకి జరిగే విషయాల గురించి మాట్లాడుకోవడం చాలా మంచిదని కౌంటర్ ఇచ్చారు.
స్టేడియంలో ప్రత్యర్థి జట్టును ఓడించేందుకు తాము కృషి చేస్తాం తప్ప…. షేక్ హ్యాండ్ విభాగం చుట్టూ తిరగబోమని సంచలన కామెంట్స్ చేశారు. టోర్నమెంట్ లో పాల్గొనబోతున్న అన్ని జట్లు కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. తాము కేవలం ఒక్క పాకిస్తాన్ జట్టు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కుదరని పని అని వివరించారు. అన్ని జట్లను సమానంగా ప్రత్యర్థులుగా భావిస్తామని కుండబద్దలు కొట్టి చెప్పారు. ప్రత్యర్థి ఎవరైనా సరే ఏ జట్టు నువ్వు తక్కువ అంచనా వేయకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే టీమిండియా ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. పాకిస్తాన్ దద్దమ్మలకు జన్మలో షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని కడా రిక్వెస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా, ఆసియా కప్ 2026 మహిళల టోర్నమెంట్ (Women’s Asia Cup 2026) ఆగస్గ్ 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ థాయ్ లాండ్ తో ఆడనున్న టీమిండియా, ఆ తర్వాత హాంగాంగ్ తో ఫైట్ చేయనుంది. సెప్టెంబర్ 5న టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరుగనుంది.