Harry Brook: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (England vs India) మధ్య ఇవాళ తొలి టి20 (India tour of England, 2026) జరగనుంది. ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియా… నేటి నుంచి ఇంగ్లాండుతో ఐదు టి20 సిరీస్ ఆడనుంది. మొన్న ఐలాండ్ తో తల పడిన భారత జట్టే…. ఇప్పుడు ఇంగ్లాండ్ తో కూడా ఢీ కొట్టనుంది. ఈ మేరకు రెండు జట్లు కూడా తొలి మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. రివర్‌సైడ్ గ్రౌండ్, చెస్టర్-లె-స్ట్రీట్ (Riverside Ground, Chester-le-Street) వేదికగా భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీని ( Vaibhav Suryavanshi ) లెక్కలోకి తీసుకోవడం లేదని.. అతన్ని డక్ అవుట్ చేయడం గ్యారెంటీ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తన దృష్టిలో శుద్ధ దండగ అంటూ బాంబు పేల్చాడు. ఇవాళ సాయంత్రం మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి మరి హ్యారీ బ్రూక్ (Harry Brook ) ఈ వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ టి20 సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో… ఇంగ్లీష్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు ఐపిఎల్ అంటే అస్సలు ఇష్టం లేదని బాంబు పేల్చాడు. ఐపీఎల్ కంటే ఇంగ్లాండ్ జట్టుకు ఆడడం తనకు ఎంతో ఇష్టం అన్నారు. అందుకే గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడినప్పటికీ, ఆ తర్వాత రియలైజ్ అయినట్లు వివరించారు. ప్రస్తుతం తాను మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు ఆడేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ స్థాయికి ఎదిగినట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జట్టుకు ఆడిన సంతోషం ఐపిఎల్ వల్ల రాదని వ్యాఖ్యానించారు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నుంచి ఆఫర్లు వచ్చినా కూడా తాను వెళ్లబోనని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఫ్రాంచైజీ లీగ్స్ నుంచి ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా కూడా తాను వెళ్ళబోనన్నారు. దీంతో హ్యారీ బ్రూక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా సిరీస్ నేపథ్యంలో వైభవ్ అరంగేట్రం చేస్తాడని అంటున్నారు. ఈ క్రమంలో అతనిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హ్యారీ బ్రూక్. తనకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు… వైభవ్ లాగే బాగా ఆడే వాడిని తెలిపారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ లోకి తొందరగా వైభవ్ వచ్చాడని ప్రశంసించారు. గత ఏడాదిన్నరగా వైభవ్ పేరు మారుమోగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆటలు సాగబోవు అన్నారు. అతనికోసం తమ వద్ద ప్రణాళిక, వ్యూహాలు ఉన్నాయని వివరించారు. అవి వర్కౌట్ అవుతాయని ఆశిస్తున్నట్లు హెచ్చరించారు. ఈ దెబ్బకు వైభవ్ డకౌట్ కావడం గ్యారెంటీ అని కూడా అంచనా వేశారు.