Indian Players : టీమిండియా క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ ఎవ్వరికీ అదృష్టం వరిస్తుందో అస్సలు ఊహించలేము. కొంత మంది కొన్ని టీమ్ ల్లో ఉన్నప్పుడూ రాణించని వారు మరో టీమ్ లోకి పోగానే రెచ్చిపోతుంటారు. మరికొందరూ ఏ టీమ్ లో ఉన్న రెచ్చిపోరు.. కానీ కీలక సమయంలో అందరితో గుర్తింపు సంపాదించుకుంటారు. ఇలా క్రికెట్ లో కొందరూ ఒక టీమ్ లో ఉన్నప్పుడు దరిద్రంగా ఉండేవారు. మరోటీమ్ లోకి వెళ్లగానే వారికి అదృష్టం తన్నుకుంటూ వచ్చేస్తుంది. ముఖ్యంగా నలుగురు క్రికెటర్లు కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఉన్న సమయంలో అంతగా ప్రదర్శన చేయలేదు. అందులోంచి బయటికీ వెళ్లాక వారి క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. వారిలో ఒకరూ టైటిల్ అందించిన కెప్టెన్ కూడా ఉండటం విశేషం. ఆ ఆటగాళ్లు ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : IND vs ENG Test Series:ఈ నెల 20 నుంచే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలి
సూర్యకుమార్ యాదవ్ :
టీమిండియా టి20 కెప్టెన్ గా ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ తొలుత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఇక ఆ తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్ తరఫున 2014 నుంచి 2017 వరకు ఆడాడు. ఆ సమయంలో సూర్య కుమార్ యాదవ్ కి అంతగా గుర్తింపు రాలేదు. 2018 నుంచి ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు సూర్య కుమార్ యాదవ్. ముంబై తరఫున సూర్యకుమారు యాదవ్ మిస్టర్ 360 గా మారాడు. సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ డెవిలియర్స్ నీ మిస్టర్ 360 అంటారు. ప్రస్తుతం మిస్టర్ 360 గా సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు.
శుబ్ మన్ గిల్ :
ప్రస్తుతం టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు గిల్. అయితే గిల్ తొలుత ఐపీఎల్ లో 2017 లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు. 2018 నుంచి 2021 వరకు కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు శుబ్ మన్ గిల్సజ. 2022 నుంచి గుజరాత్ సైతం తరపున ఆడుతున్నాడు. 2023లో గుజరాత్ ఐటమ్స్ టైటిల్స్ సాధించింది. ఆ సమయంలో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొనసాగాడు.
శ్రేయాస్ అయ్యర్ :
టీమిండియా కీలక ఆటగాడు శ్రేయ సయ్యద్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. టీమిండియాలో వన్డే లలో కీలక ఆటగాడిగా ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. మరోవైపు అయ్యర్ ని t20 లకు.. టెస్ట్ మ్యాచ్లకు తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. శ్రేయ సయ్యర్ ఐపిఎల్ ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున
కెప్టెన్ గా.. అలాగే కోల్కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఉండి 2024లో టైటిల్ కూడా అందించాడు. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ ని ఆ జట్టు వదిలేసి.డి. దీంతో పంజాబ్ పోటీపరి మరి శ్రేయస్సుని దక్కించుకుంది. శ్రేయ సయ్యర్ కెప్టెన్ గా పంజాబ్ నే ఫైనల్స్ చేర్చాడు. తన కెప్టెన్సీలో తృటిలో టైటిల్ చేజారిపోయింది.
సుయాష్ శర్మ :
సురాజ్ శర్మ ఐపిఎల్ లో 2023, 24 కి కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఆడాడు. 2024 లో కేకేఆర్ తరఫున ఆడిన సమయంలో టైటిల్ గెల్చుకుంది కానీ సుయాస్ మాత్రం అంతగా పర్ఫామెన్స్ కనబరచలేదు. దీంతో సుయాష్ ని కోల్ కతా వదులుకుంది. 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సుయాజ్ శర్మను కొనుగోలు చేసింది. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు 101 పరుగులకే ఆల్ అవుట్ అయిందంటే అందులో సుయాష్ శర్మ పాత్ర కీలకమనే చెప్పాలి. మ్యాచ్ మొత్తం టర్నింగ్ తిప్పేశాడు ఈ లెగ్స్పిన్నర్. ఇలా శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, గిల్, సుయాష్ వంటి వారు కేకేఆర్ లో ఉన్నప్పుడు వారికి దరిద్రం పట్టింది. ఇప్పుడు వారు ఆయా జట్లలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు.

Share