BigTV English

Sheheen Afridi vs Matthew Breetzke: షాహిన్ అఫ్రిదిపై సౌతాఫ్రికా ప్లేయర్‌ దాడి..వణికిపోయిన పాక్‌ ?

Sheheen Afridi vs Matthew Breetzke: షాహిన్ అఫ్రిదిపై సౌతాఫ్రికా ప్లేయర్‌ దాడి..వణికిపోయిన పాక్‌ ?

 


Sheheen Afridi vs Matthew Breetzke: పాకిస్తాన్ గడ్డపైన… ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, పాకిస్తాన్ అలాగే సౌత్ ఆఫ్రికా మూడో జట్ల మధ్య వన్డే ట్రై సిరీస్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ ట్రై సిరీస్ లో భాగంగా ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మూడవ వన్డే ప్రారంభమైంది. పాకిస్తాన్ లోని కరాచీ స్టేడియంలో… ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ బౌలర్లను.. చీల్చి చెండాడుతున్న సఫారీ బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే ( Matthew Breetzke )… గ్రౌండ్ లో తాండవం మాడాడు. ఏకంగా పాకిస్తాన్ స్టార్ బౌలర్… షాహిన్ ఆఫ్రిది ( Sheheen Afridi ) పైన… తన ప్రతాపం చూపించాడు మాథ్యూ బ్రీట్జ్కే ( Matthew Breetzke ).

Also Read: CCL Cricket Free Passes: వాలంటైన్స్‌ ఆఫర్‌..ఉప్పల్‌ తెలుగు వారియర్స్‌ మ్యాచ్‌ లు ఫ్రీగా చూడండి ?


ఈ మ్యాచ్ 29 ఓవర్ వేసేందుకు పాకిస్తాన్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది రంగంలోకి దిగాడు. అయితే ఆ సమయంలో సఫారీ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే ( Matthew Breetzke )… సింగిల్ తీసే ప్రయత్నం చేసి ఆగిపోయాడు. అయితే అప్పుడు బ్యాట్‌ పైకి ఎత్తడం కనిపించింది. దీంతో తనకు వార్నింగ్ ఇస్తున్నాడని… తప్పుగా అర్థం చేసుకున్న షాహిన్ ఆఫ్రిది… ఆ సఫారీ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే ( Matthew Breetzke ) పైకి గొడవకు వెళ్ళాడు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగి కాస్త గొడవ జరిగింది. ఒకరి పైకి మరొకరు దూసుకు వెళ్లారు. ఆ తర్వాత…. సింగిల్ తీశాడు మాథ్యూ బ్రీట్జ్కే ( Matthew Breetzke ). ఆ సమయంలో కూడా ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అయితే షాహిన్ ఆఫ్రిది ( Sheheen Afridi )… కోపంగా… పైకి రావడంతో తాను కూడా తగ్గేదే లేదని… రెచ్చిపోయాడు సఫారీ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే ( Matthew Breetzke ).

 

ఇక అక్కడ గొడవ పెద్దది అవుతుందని గ్రహించిన అంపైర్లు అలాగే పాకిస్తాన్ క్రికెటర్లు… ఇద్దరినీ దూరం తీసుకువెళ్లారు. ఇందులో పాకిస్తాన్ ఆటగాడు షాహిన్.. ఆఫ్రిదీదే తప్పు అని… తెలుస్తోంది. ఇక ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే… మాథ్యూ బ్రీట్జ్కే ( Matthew Breetzke ) ను గెలికిన అఫ్రిదీపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. పాకిస్థాన్‌ లో ఆడుతున్నామని.. బౌలర్ షాహీన్ ఆఫ్రిది ( Sheheen Afridi ) కావాలనే రెచ్చిపోయి ఇలా ప్రవర్తించాడని నెటిజన్స్‌ కూడా కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌ లో సఫారీ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే ( Matthew Breetzke )… అద్భుతంగా బ్యాటింగ్‌ చేసి.. జట్టు భారీ స్కోర్‌ అందించారు. 84 బంతుల్లోనే 83 పరుగులు చేసి దుమ్ములేపాడు. దీంతో.. నిర్ణిత 50 ఓవర్లలోనే… 5 వికెట్లు నష్టపోయి.. 352 పరుగులు చేసింది సఫారీ జట్టు. ఇక ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాకిస్థాన్‌ ఇబ్బందులు పడుతోంది. వంద పరులుగు చేయకముందే.. 3 వికెట్లు నష్టపోయింది.

Also Read: IND vs Eng 3rd ODi: హాట్ స్టార్ సేవల్లో అంతరాయం..టీమిండియా ఫ్యాన్స్‌ సీరియస్‌ ?

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×