CCL Cricket Free Passes: మనదేశంలో క్రికెట్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా.. కాదు. చాలామంది క్రికెట్ చూస్తూ.. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే చాలామంది ఆసక్తిగా.. ఎలాంటి క్రికెట్ ఫార్మాట్ వచ్చిన… ఆదరిస్తూ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత చిన్నచిన్న లీగ్ లు చాలానే వచ్చాయి. ఈ తరుణంలోనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్… తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 7,8 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ కొనసాగుతోంది. అయితే 2025 టోర్నమెంట్ కూడా ఈసారి ప్రారంభమైంది.
Also Read: IND vs Eng 3rd ODi: హాట్ స్టార్ సేవల్లో అంతరాయం..టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ ?
2025 సెలెబ్రెటీ క్రికెట్ లీగ్… ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైంది. ఫిబ్రవరి 8వ తేదీన ఏకంగా రెండు సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో తెలుగు వారియర్స్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా… ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తేదీన వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు క్రికెట్ యూనివర్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. లవర్స్ డే అయినా ఫిబ్రవరి 14వ తేదీ అలాగే ఫిబ్రవరి 15వ తేదీలలో… ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు జరగనున్నాయి.
ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లు బెంగళూరులో జరిగాయి. ఇక ఫిబ్రవరి 14 అలాగే ఫిబ్రవరి 15వ తేదీన హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే అదిరిపోయే ప్రకటన చేసింది తెలుగు క్రికెట్ యూనివర్స్. ఈ మ్యాచ్ లు ఉచితంగా.. చూసేలా టికెట్లు లేదా పాసులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది తెలుగు క్రికెట్ యూనివర్స్. దీనికోసం తెలుగు వారియర్స్ సోషల్ మీడియా అకౌంటును… ఫాలో కావాలని ఒక కండిషన్ పెట్టింది. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సోషల్ మీడియా అకౌంట్ అలాగే తెలుగు వారియర్స్ కు సంబంధించిన అకౌంట్ ను కూడా ఫాలో కావాలని పేర్కొంది.
ఫిబ్రవరి 14వ తేదీన మ్యాచ్ టికెట్ కావాలంటే…Day 1 అని కామెంట్ చేయాలి. ఆ తర్వాత… కామెంట్ చేసిన వారి ఫ్రెండ్స్ కు ఆ.. లింక్ ట్యాగ్ చేయాలి. ఇక ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ చూడాలనుకుంటే…day 2 అని కామెంట్ చేసి తమ తమ స్నేహితులకు ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక్క.. యూజర్ కు ఒక టికెట్ మాత్రమే ఇస్తారు. ఇక మ్యాచ్ రోజు స్టేడియం దగ్గరే టికెట్లను ఇస్తారు. కామెంట్స్ బాక్స్ లో వాళ్లకు సంబంధించిన నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు.
Also Read: Great Khali: పాపం…పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఖలీ… వీడియో వైరల్ !
ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 14వ తేదీన చెన్నై వర్సెస్ కర్ణాటక బుల్డోజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజున సాయంత్రం తెలుగు వారియర్స్ వర్సెస్ భోజ్ పూరి జట్ల మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 15వ తేదీన.. ముంబై వర్సెస్ కర్ణాటక మధ్య మ్యాచ్ ఉంటుంది. రెండవ మ్యాచ్ చెన్నై వర్సెస్ తెలుగు వారియర్స్ మధ్య ఉంటుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">