BigTV English

Heath Streak: మరణం రూమర్.. క్యాన్సర్ తో పోరాడుతున్నా.. హిత్ స్ట్రీక్ క్లారిటీ..

Heath Streak: మరణం రూమర్.. క్యాన్సర్ తో పోరాడుతున్నా.. హిత్ స్ట్రీక్ క్లారిటీ..

Heath Streak : జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హిత్ స్ట్రీక్ మరణవార్త నిజంకాదని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా హిత్ స్ట్రీక్ ఖండించాడు. తాను మృతిచెందానని సోషల్‌ మీడియాలో వార్తలు రావడంపై మండిపడ్డాడు. ఆ కథనాలు మానసికంగా బాధకు గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను క్యాన్సర్‌తో పోరాడుతూనే ఉన్నానని ప్రకటించాడు.


తొలుత హీత్ స్ట్రీక్‌ కన్నుమూసినట్లు జింబాబ్వే మాజీ ఆటగాడు హెన్రీ ఒలొంగా ట్విట్ చేశాడు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. కాసేపటికే వాస్తవం తెలుసుకుని ఒలంగా మరో ట్వీట్ చేశాడు. జింబాబ్వే క్రికెట్‌ దిగ్గజం హీత్ స్ట్రీక్‌ మరణ వార్తలన్నీ రూమర్లే అని పేర్కొన్నాడు. స్ట్రీక్‌ కోలుకుంటున్నాడని తెలిపాడు. అతడితో మాట్లాడానని వివరణ ఇచ్చాడు.

ఆండీ ఫ్లవర్‌, గ్రాంట్ ఫ్లవర్ బ్రదర్స్ , క్యాంబెల్ తో కలిసి జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నతస్థాయికి చేర్చడంలో హీత్ స్ట్రీక్‌ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా జింబాబ్వే జట్టుకు సుధీర్ఘకాలం సేవలందించాడు. ఆ సమయంలో అనేక అగ్రశ్రేణి జట్లపై జింబాబ్వే సంచలన విజయాలు సాధించింది.


హిత్ స్ట్రీక్ జింబాబ్వే తరఫున 1993 నుంచి 2005 వరకు ఆడాడు. 12 ఏళ్లలో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 1990 పరుగు చేశాడు. అందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యుత్తమ వ్యక్తి గత స్కోర్ 127 నాటౌట్. బౌలర్ గానూ రాణించాడు. 216 వికెట్లు పడగొట్టాడు. 7సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.

వన్డేల్లో హిత్ స్ట్రీక్ మెరుగ్గా రాణించాడు. మొత్తం 2,942 పరుగులు చేశాడు. అందుల్లో 13 హాఫ్ సెంచరీలున్నాయి. అత్యుత్తమ వ్యక్తి గత స్కోర్ 79 నాటౌట్. బౌలింగ్ లోనూ సత్తాచాటి 239 వికెట్లు తీశాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 4,932 పరుగులు చేయడంతోపాటు 455 వికెట్లు తీసి మంచి ఆలౌరౌండర్ గా గుర్తింపు పొందాడు. 2016 నుంచి 2018 వరకు జింబాబ్వే జట్టుకు, దేశవాళీ లీగ్‌లలోని జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గానూ స్ట్రీక్ పని చేశాడు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×