Tirupati Trains Cancel: దక్షిణ రైల్వే పరిధిలోని పలు ప్రదేశాల్లో మెయింటెనెన్స్ పనులు కొనసాగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా అరక్కోణం-జోలార్‌పేట్ విభాగంలో ఈ పనులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనుల కారణంగా జూన్ 16 నుంచి 18 తేదీల్లో కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ఈ కీలకమైన కారిడార్ లో భద్రత, సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించింది.
రెండు రోజుల పాటు కొనసాగనున్న పనులు
రెండు రోజులలో రాత్రి 9:00 నుంచి 12:30 గంటల మధ్య సిగ్నల్, లైన్ బ్లాక్, రైల్వే నిర్వహణ, ఆధునీకరణ పనులను కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగాపలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
⦿ తిరుపతి-కాట్పాడి మెము ప్యాసింజర్ రైలును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కాట్పాడి నుంచి రాత్రి 9:10 గంటలకు బయలుదేరాల్సిన రైలు(నంబర్ 67209) రెండు రోజులూ పూర్తిగా రద్దు చేయబడుతుంది. అదేవిధంగా, తిరుపతి నుంచి సాయంత్రం 7:10 గంటలకు బయలుదేరే రైలు(నంబర్ 67210) కూడా ఈ పనుల కారణంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైళ్లలో రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.
⦿ చెన్నై బీచ్- తిరువన్నమలై రైలు(నంబర్ 66033)ను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరాల్సిన రైలు జూన్ 16న అందుబాటులో ఉండదని తెలిపారు. జూన్ 17, 18 తేదీల్లో ఉదయం 4:30 గంటలకు తిరువన్నమలై నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు(నెంబర్ 66034) కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
⦿ అరక్కోణం- కాట్పాడి మధ్య నడిచే విల్లుపురం–కాట్పాడి MEMU(నంబర్ 66057) జూన్ 16- 18 తేదీల్లో రాత్రి 9:00 గంటలకు బయల్దేరే ఈ రైలు ఇప్పుడు సేవూర్ స్టేషన్ వరకు మాత్రమే నడుస్తుంది. అటు మరో రైలు (నంబర్ 66026) రాత్రి 7:10 గంటలకు విల్లుపురం నుండి బయలుదేరుతుంది. వెల్లూరు వరకు ప్రయాణిస్తుంది.
Read Also: 2 గంటల పాటు రైలును ఆపేసిన ప్రయాణీకులు.. ఎక్కనే ఎక్కమంటూ ఇంజిన్ ముందు హంగామా!
ఏ పనులు చేపడుతున్నారంటే?
మెరుగైన ప్రయాణ సౌకర్యాల కోసం ఈ అంతరాయాలు తప్పవని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాక్‌లు, సిగ్నల్‌లు, ఓవర్ హెడ్ పరికరాలను అప్ గ్రేడ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పనులతో ప్రయాణీకుల భద్రతను పెంచడం, పట్టాలు తప్పే ప్రమాదాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా విద్యుత్ రైళ్లను సజావు నిర్వహించే వీలవుతుందన్నారు. ఇంధన సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ పనులు పూర్తయిన వెంటనే రైళ్లు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని అధికారులు తెలిపారు. రైళ్ల రద్దు, ఆలస్యానికి సంబంధించిన విషయాలను నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES), IRCTC మొబైల్ యాప్ లేదంటే అధికారిక దక్షిణ రైల్వే వెబ్‌సైట్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Also: రైలు కిందకు దూసుకెళ్లిన టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. తప్పు నాది కాదు, కారుదే అంటోన్న డ్రైవర్!