Big Stories

HYD IPL Tickets in Black: ఐపీఎల్ టికెట్ల వ్యవహారం.. బుక్కైన ఐటీ ఉద్యోగులు!

Hyderabad IPL Tickets in Black: ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌లకు అభిమానులకు టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా బుకింగ్ ఓపెన్ అయిన కొద్దిక్షణాలకే టికెట్లు హాట్ కేకుల్లా  అమ్ముడుపోతున్నాయి. చాలామందికి టికెట్లు దొరకడంలేదు. ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌పై ఇంటా బయటా విమర్శలు తీవ్రమయ్యాయి. ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో వేదికగా హైదరాబాద్-బెంగుళూరు జట్ల మ్యాచ్ జరగనుంది.

- Advertisement -

క్రికెట్ లవర్స్ అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని భావించారు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ఐటీ ఉద్యోగులు. ఒక్కో టికెట్ పది వేల నుంచి 15 వేల రూపాయలకు అమ్ముతున్నారు. సమీపంలోకి కొందరు క్రికెట్ అభిమానులు ఈ విషయాన్ని చాటుగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు ఐటీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు.

- Advertisement -

అసలేం జరిగింది? ఎలా పట్టుబడ్డారు? కొండాపూర్‌లో ఇస్నాపూర్‌కు చెందిన మధుబాబు, సైనిక్ పురి డిఫెన్స్ కాలనీకి చెందిన మాధ్యూ రోడ్రిక్స్, కొండాపూర్‌కి చెందిన ఎలంగోవర్ ఈ ముగ్గురు టీమ్‌గా ఏర్పడ్డారు. మరి టికెట్లు ఎలా సంపాదించారో తెలీదుగానీ, ఒక్కో టికెట్ 10 వేల రూపాయలకు రేటు పెట్టారు. అదే సమయంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అక్కడకు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌కు సంబంధించిన 15 టిక్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: చెలరేగిన రాహుల్.. సునాయాసంగా గెలిచిన లక్నో..

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసు వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ఓ వ్యక్తి ద్వారా టికెట్లను తీసుకున్న ఐటీ ఉద్యోగులు.. వాటిని మూడింతలు రెట్టింపు ధరకు అమ్ముతూ క్యాష్ చేసుకున్నట్లు తేలింది. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి అత్యాశ పోయి అడ్డంగా బుక్కయ్యారు ముగ్గురు ఐటీ ఉద్యోగులు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News