BigTV English

SRH Vs MI Match Highlights: ఆఫ్ కట్టర్స్ వేయాలనే వ్యూహంతో వచ్చాం: కమిన్స్!

SRH Vs MI Match Highlights: ఆఫ్ కట్టర్స్ వేయాలనే వ్యూహంతో వచ్చాం: కమిన్స్!

Pat cummins comment on SRH vs MI match


Pat Cummins Comment on SRH Vs MI match: హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ని ఇప్పుడప్పుడే జనం మరిచిపోయేలా లేరు. ఎందుకంటే అంత విధ్వంసం ఆ మ్యాచ్ లో జరిగింది. హార్దిక్ పాండ్యాకు పీడకలగా మిగిలిపోయింది.. పాట్ కమిన్స్ కు తీయని జ్నాపకంగా మారిపోయింది. తనని అత్యధిక ధరకు కొనుక్కు రావడం కరెక్టేనని ఇప్పుడందరూ అంటున్నారు.

ముంబై ఇండియన్స్ కూడా 244 పరుగులు భారీ స్కోరే చేసింది. కానీ రెండు జట్లలో ప్రధాన తేడా ఏమిటంటే కెప్టెన్సీ అని అందరూ తేల్చి చెబుతున్నారు. అక్కడ హైదరాబాద్ జట్టుని పాట్ కమిన్స్ సరైన దారిలో నడిపించాడు.అదే పాండ్యా చేయలేకపోయాడని తేడా చెబుతున్నారు. ఇక ముంబై బ్యాటర్లు విధ్వంసం చేస్తున్నా ప్రణాళిక ప్రకారం బౌలర్లని ప్రయోగించి, మ్యాచ్ కి విజయాన్ని అందించాడు.


ఈ నేపథ్యంలో కమిన్స్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. నిజానికి భారీ లక్ష్యాన్ని ఇవ్వాలని అనుకున్నాం. అంతేగానీ 277 పరుగులు చేస్తుందని ఊహించలేదని అన్నాడు. యువ ఆటగాడు అభిషేక్ శర్మలోని ఆటగాన్ని గుర్తించాను. అందుకనే అతన్ని ప్రోత్సహించానని అన్నాడు. ఈరోజు అది వర్కవుట్ అయ్యింది.

Also Read: రోహిత్ తో మాట్లాడిన ఆకాశ్ అంబానీ..

రెండోది ముంబై బ్యాటర్లు ఛేజింగ్ లో దూసుకెళ్తున్నా బౌలింగ్ ట్రాక్ మార్చలేదు. ఆఫ్ కట్టర్లు వేయాలనే అనుకున్నాం. వాళ్లు కొడుతున్నా అదే వ్యూహాన్ని అమలు చేశాం. అది ఫలితాన్నించిందని అన్నాడు. ముంబై జట్టు ఛేజ్ చేస్తుందా అంటే చెప్పలేను. రెండు జట్లు బాగా ఆడాయి. అయితే మ్యాచ్ రోజు మావాళ్లు బాగా బౌలింగ్ చేశారు. అదే వారికి, మాకు తేడా…అని అన్నాడు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని అన్నాడు. ఏదేమైనా ఈ మ్యాచ్ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని అన్నాడు.

ఈ సందర్భంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ మాట్లాడుతూ నాకు బ్యాటింగ్ కన్నా బౌలింగ్ ఇష్టమని అన్నాడు. మ్యాచ్ ముందురోజు బ్రయాన్ లారాతో మాట్లాడటం కలిసొచ్చిందని అన్నాడు. తను కొన్ని టిప్స్ చెప్పాడు. అవీ మ్యాచ్ రోజు ఫలించాయని అన్నాడు. అలాగే నాకు నచ్చిన ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ ఒకరని అన్నాడు. తనతో క్రీజులో ఆడటాన్ని ఎంజాయ్ చేశానని తెలిపాడు. నేను కొట్టే షాట్లకి తను ప్రోత్సహిస్తుంటే చాలా ఉత్సాహం కలిగిందని అన్నాడు.

Tags

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×