Big Stories

Crypto King Sam Bankman Jail: ఒకప్పుడు కింగ్.. తప్పుచేశాడు.. 25 ఏళ్ల జైలుశిక్ష!

Crypto King Sam Bankman jail

- Advertisement -

Crypto King Sam Bankman Jail: క్రిప్టో ఎక్స్చేంజ్ ఎఫ్‌టీఎక్స్ సహ ఫౌండర్ శామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌ కథ ముగిసింది. ఆయనకు న్యూయార్క్ న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జరుగుతున్న తప్పులు ఆయనకు ముందే తెలుసని న్యాయమూర్తి తేల్చారు. ముఖ్యంగా కస్టమర్లను మోసం చేశానన్న బాధ ఉన్నప్పటికీ, విచారణలో మాత్రం దాన్ని ఆయన అంగీకరించలేదన్నారు. అయితే బ్యాంక్‌మన్ తరపు న్యాయవాదులు మాత్రం శిక్షను ఐదు నుంచి ఆరేళ్లకు పరిమితం చేయాలని కోర్టును అభ్యర్థించారు. దానికి న్యాయమూర్తి ససేమిరా అన్నారు.

- Advertisement -

ఇంతకీ అసలు కేసు ఏంటి? 2017 ఏడాది వాల్‌స్ట్రీట్‌లో ఉద్యోగం వదిలేశాడు బ్యాంక్‌మన్. అలమెడా రీసెర్చ్ పేరిట హెడ్జ్ ఫండ్‌ను ఏర్పాటు చేశాడు. రెండేళ్ల తర్వాత ఎఫ్‌టీఎక్స్ పేరుతో ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేశాడు. బహమాస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన బ్యాంక్‌మన్, తనదైన శైలిలో అందర్నీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బిల్‌క్లింటన్ వంటి హేమాహేమీలతోనూ సమావేశమయ్యేవాడు. క్రిఫ్టో సురక్షిత మైనదని, అందులో పెట్టుబడులు పెట్టాలంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చేశాడు. అంతేకాదు ఇందుకోసం హాలీవుడ్ సెలబ్రిటీలను రంగంలోకి దించాడు.

ఇంతకీ కేసు లోతుల్లోకి వెళ్తే.. ఎఫ్‌టీఎక్స్-అలమెడా రీసెర్చ్ మధ్య సంబంధం మొదలైంది. ఈ రెండు కంపెనీలు వేర్వేరని బ్యాంక్‌మన్ తరచూ చెప్పేవాడు. చివరకు అది వాస్తవం కాదని తేలిపోయింది. అల మెడా ఆస్తుల్లో చాలావరకు ఎఫ్‌టీఎక్స్ క్రిఫ్టో టోకెన్ల రూపంలో ఉన్నట్లు గుట్టు బయటపడింది. మార్కెట్ విలువ ప్రకారం తమ ఎఫ్‌టీటీ టోకెన్ల విలువ బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అప్పట్లో లెక్క కట్టింది. కానీ టోకెన్లు అన్నీ ఇరుసంస్థల మధ్య ఉన్నట్లు నమ్మించాడు. అసలు సర్క్యూలేషన్‌లో ఉన్నవి చాలా తక్కువ. ఈ లెక్కన అలమెడా విలువ పూర్తిగా ఊహాజనితమేనని తేలిపోయింది.

Also Read: South Africa News: దారుణం.. లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి

ఈ విషయం బయట ప్రపంచానికి తెలియగానే ఎఫ్‌టీఎస్ ప్రత్యర్థి సంస్థ బైనాన్స్ ఊహాత్మంగా వ్యవహరించి తమ వద్దనున్న ఎఫ్‌టీటీ టోకెన్లను పూర్తి విక్రయించి బయటపడింది. దీంతో మిగతా ట్రేడర్లు ఎఫ్‌టీటీ హోల్డింగ్స్‌ను వదిలించుకునేందుకు ఎగబడ్డారు ఫలితంతా ఎఫ్‌టీటీ విలువ 75 శాతానికి పడిపోయింది. అలమెడా ఆస్తులు పూర్తిగా ఆవిరైపోయాయి. ఎఫ్‌టీఎక్స్ నుంచి నిధులు ఉపసంహరించుకునేందుకు మదుపర్లు ఎగబడ్డారు. అప్పటికే ఎఫ్‌టీఎక్స్ ఫండ్స్‌ను అలమెడా కిందకు తరలించింది.

మదుపర్లు ఒక్కసారిగా విత్ డ్రాలకు ఎగబడ్డారు. దీంతో మదుపర్లకు నగదు చెల్లించేందుకు ఎఫ్‌టీఎక్స్ వద్ద నిధుల్లేవు. అలమెడా వద్ద నున్న టోకెన్లకు విలువ పడిపోయింది. చివరకు ఎఫ్‌టీఎక్స్ దివాలాకు దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యవహారంలో బ్యాంక్‌మన్‌తోపాటు మరో ముగ్గురు ఉన్నారు. వారంతా తమ తప్పులను కోర్టు మందు అంగీకరించారు. బ్యాంక్‌మన్ ఆదేశాల మేరకు తాము నడుచుకున్నట్లు తెలిపారు.

Also Read: Loan against Fixed Deposit (FD): ఎఫ్‌డీపై లోను తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

కస్టమర్లను మోసం చేయడం అక్రమ నగదు చలామణి సహా ఏడు అభియోగాల్లో బ్యాంక్‌మన్‌ను న్యాయ స్థానం దోషిగా తేల్చింది. దాదాపు 10 బిలియన్ డాలర్ల ఆర్థిక నేరం జరిగినట్టు గుర్తించింది. ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా హిస్టరీలో అతి పెద్ద ఆర్థిక మోసాల్లో ఇది ఒకటి. శిక్ష ఖరారుకు ముందు బ్యాంక్‌మన్ వ్యవహారశైలిపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. విచారణ సమయంలో ఆయన అన్నీ అబద్దాలు చెప్పారని, కస్టమర్ల నగదు ఇతర మార్గాల్లోకి వెళ్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు.

తన క్లయింట్ ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని లైఫ్‌లో తొలి నేరమని బ్యాంక్‌మన్ తరపు లాయర్లు కోర్టును అభ్యర్థించారు. సంస్థ దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కస్టమర్లు తాము కోల్పోయిన సొమ్ములో మెజార్టీ భాగాన్ని పొందే ఛాన్స్ ఉందని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకుని తక్కువ శిక్ష ఖరారు చేయాలని న్యాయమూర్తికి విన్నవించారు. మరోవైపు ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాత్రం బ్యాంక్‌మన్‌కు వందేళ్లు జైలుశిక్ష వేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయమూర్తి 25 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News