భార్య భర్తలు అన్నాక గొడవలు, అలకలు మామూలే. కొన్నిసార్లు పరిస్థితులు కొట్లాటల వరకు వెళ్తాయి. మరికొన్నిసార్లు పెద్ద రచ్చ అవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విఫయం కూడా అలాంటిదే. ఇంట్లో కొట్లాడుకోవాల్సిన భార్య భర్తలు ఏకంగా రోడ్డు మీదే తన్నుకున్నారు. ఇంకా చెప్పాలంటే మొగుణ్ణి పెళ్లాం, మురికి మోరీలో పడేసి తన్నింది. భార్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఏటూపోలేక తన్నులు తింటూ ఉండిపోయాడు. ప్రస్తుతం వీరి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి మార్కెట్ ప్లేస్ WWEగా మారిపోయిదంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
తాజాగా కాన్ఫూర్ లో ఈ ఘటన జరిగింది. భర్త దుకాణం ముందు కూర్చొని గాజులు సర్దుతుండగా, వెనుక నుంచి వెళ్లి వీపు మీద గట్టిగా కాలుతో తన్నుతుంది. ఆ దెబ్బ గాజుల మీద పడిపోతాడు. అక్కడి నుంచి తేరుకునే లోగా మీద పడి చితకబాదుతుంది. నేల మీద పడేసి పిడిగుద్దులు గుద్దుతుంది. పక్కనే ఉన్న గాజులు తీసి అతడి మీద విసురుతుంది. పక్కనే ఉన్న మురికి కాల్వలో పడేసి చిత్తు చిత్తుగా కొడుతుంది. పక్కన జనాలు ఉండి, ఈ తతంగాన్ని మొత్తం ఫోన్లలో రికార్డు చేశారే తప్ప, ఎవరూ ఆమె నుంచి అతడిని కాపాడే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, ఈ గొడవకు కారణం ఏంటనే విషయం ఎవరికీ తెలియదు.
ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది భర్తను చూసి అయ్యో పాపం అంటుంటే, మరికొంత మంది ఏం ఘనకార్యం చేశాడో అంటూ విమర్శలు చేస్తున్నారు. “WWEలో భారతీయ జంట చేసిన స్టంట్స్ ఇవి. 100% నిజమైనవి. ఎవరూ ప్రయత్నించకండి” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మరో వ్యక్తి ఆమెను లేడీ అండర్ టేకర్ అంటూ జోక్ చేశాడు. “ఆ మహిళకు ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆమె కచ్చితంగా WWEలో పోటీ పడగలదు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోకు జోరుగా ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. అటు ఈ ఘటనపై కొంత మంది సీరియస్ గా స్పందిస్తున్నారు. ఒకవేళ పురుషుడు అలా చేసి ఉంటే కచ్చితంగా గృహహింస కిందికి వచ్చేది. ఇప్పుడు సదరు మహిళ మీద కూడ అదే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Kalesh b/w a Couple pic.twitter.com/qeUVf42EJP
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2025
కాన్పూర్ లో ఫైటింగ్ వీడియోలు బోలెడు వైరల్ అయినప్పటికీ, భార్య భర్తను కొట్టడం లేని ఇదే తొలిసారి. అదీ సోషల్ మీడియాలోకి రావడంతో బాగా వైరల్ అయ్యింది. ఈ బ్యాంగిల్ షాప్ ముందు గొడవ హై వోల్టేజ్ డ్రామాలా మారింది.
Read Also: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!