New Zealand Squad: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ( ICC Champions Trophy 2025 ) ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే.. అన్ని జట్లు తమ ప్లేయర్ల లిస్టును ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం… ఇవాళ ICC ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన జట్ల వివరాలను ప్రకటించాలి. ఈ మేరకు డేడ్ లైన్ పెట్టింది ఐసీసీ. ఈ తరుణంలోనే…. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy 2025 ) కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టును ( New Zealand Squad ) ప్రకటించింది ఆ బోర్డు.
Also Read: Gilchrist on Rohit Sharma: రోహిత్ ఇక చాలు…ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో…!
ఆదివారం, జనవరి 12న అంటే ఇవాళే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ( New Zealand). ఈ మేరకు ICC ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఎంపికైన ఆటగాళ్ల పేర్లను వెల్లడించారు ODI కెప్టెన్ మిచెల్ సాంట్నర్ ( Michelle Santner ) ICC ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో న్యూజిలాండ్ ( New Zealand) మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ( Kane Williamson ) జట్టులోకి తిరిగి వచ్చాడు. ODI ప్రపంచ కప్ 2023లో జట్టు సెమీ-ఫైనల్ ఓటమి తర్వాత మొదటిసారిగా 50 ఓవర్ల ఆట ఆడనున్నాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ( Kane Williamson ) . సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా వైదొలిగాడు కేన్ విలియమ్సన్.
అయినప్పటికీ అతన్ని సెలక్ట్ చేశారు. జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన విలియమ్సన్ ఉంటే… టోర్నమెంట్ లో రాణిస్తామని అతన్ని మళ్లీ తీసుకొచ్చారు. 2013, 2017 ఎడిషన్‌లలో కూడా జట్టుకు కేన్ మామ సేవల అందించారు.
గత కొన్నేళ్లుగా ఐసిసి టోర్నమెంట్లలో అత్యధికంగా టాప్ 4కి చేరిన కివీస్ కు… బలమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. డెవాన్ కాన్వే, విల్ యంగ్, రవీంద్ర, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్ మరియు విలియమ్సన్ లాంటి ప్లేయర్లు జట్టుకు బలమైన పిల్లర్లుగా ఉన్నారు. ఇక కెప్టెన్ సాంట్నర్ తొలిసారిగా ICC ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy 2025 ) లాంటి ప్రధాన టోర్నీలో న్యూజిలాండ్‌ను ముందుండి నడిపించనున్నాడు. అంతేకాదు… మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లెన్ ఫిలిప్స్ , రాచిన్ రవీంద్రతో కలిసి స్పిన్ బౌలింగ్ ఎంపికకు నాయకత్వం కూడా వహిస్తాడు.
Also Read: Gary Hall Jr Olympic Medals: 10 పతకాలు కాలి బూడిద… ఒలింపిక్ స్విమ్మర్ కు ఎన్ని కష్టాలో !
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), విల్ యంగ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, బెన్ సియర్స్, విల్ ఓర్కీ
న్యూజిలాండ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు:
NEW ZEALAND SQUAD FOR CHAMPIONS TROPHY 2025: 🏆
Santner (C), Williamson, Michael Bracewell, Chapman, Conway, Ferguson, Henry, Latham, Daryl Mitchell, Will O’Rourke, Phillips, Rachin, Sears, Nathan Smith, Will Young. pic.twitter.com/fiLeH39pR7
— Johns. (@CricCrazyJohns) January 12, 2025
NEW ZEALAND CHAMPIONS TROPHY SQUAD ANNOUNCEMENT. 🏆pic.twitter.com/kREw66qNv1
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2025