ICC CT 2025 – IPL 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని గ్రాండ్ గా స్టార్ట్ చేసిన భారత జట్టు వరుస విజయాలతో దూసుకు వచ్చి ఫైనల్ కీ చేరుకుంది. ఈ టోర్నీలో మొదట బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసిన భారత్.. రెండవ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ని ఓడించింది. దీంతో సెమీఫైనల్ కి అర్హత సాధించిన రోహిత్ సేన.. తన చివరి లీగ్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించి గ్రూప్-ఏ లో టేబుల్ టాపర్ గా నిలిచింది.
ఇక రెండవ సెమీస్ న్యూజిలాండ్ – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగగా.. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్ విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. దీంతో మార్చ్ 9 ఆదివారం రోజున భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. అయితే వరుస విజయాలతో భారత జట్టు జోరుమీదున్నా.. న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ అంటే అభిమానులలో కాస్త కంగారు మొదలైంది. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఐసీసీ నాకౌట్ టోర్నీ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిపాలైంది.
ఆ తర్వాత 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లోను న్యూజిలాండ్ చేతిలో భారత్ కి ఓటమి తప్పలేదు. అంతేకాకుండా ఇప్పటివరకు ఐసీసీ టోర్నిల్లో భారత జట్టుపై న్యూజిలాండ్ దే పైచేయిగా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ మిచెల్ శాంట్నర్ చాలా కీలకం. అతడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మూడు వికెట్లతో మ్యాచ్ ని మలుపు తిప్పాడు.
అంతేకాకుండా ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లలో 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ లో మిచెల్ శాంట్నర్ కి వ్యతిరేకంగా టీమ్ ఇండియా పగడ్బందీ ప్రణాళికలతో బరిలోకి దిగాల్సి ఉంది. లేదంటే భారత జట్టు పతనాన్ని అతడు శాసించగలడు. మరోవైపు ఈ టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్ లు ఒకే వేదికపై, ఓకే మైదానంలో ఆడడం కలిసొచ్చే అంశం. మరోవైపు భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ టై గా ముగిస్తే.. ఒక రిజల్ట్ వచ్చే వరకు ఇరుజట్లు సూపర్ ఓవర్లు ఆడడం కొనసాగిస్తాయి.
ఒక సూపర్ ఓవర్ టై అయితే… వరుసగా సూపర్ ఓవర్లు ఆడతారు. నిర్ణయం వచ్చేవరకు ఇలా సూపర్ ఓవర్లు ఆడతారు. ఇదిలా ఉంటే.. ఈ ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ – భారత్ జట్ల మధ్య జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ కి శాంట్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక భారత్ కి రోహిత్ శర్మ కెప్టెన్. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఓ ప్లేయర్ మాత్రమే. కానీ ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} ప్రారంభం కాబోతోంది. అయితే ఐపీఎల్ లో మాత్రం ఈ ఇరిజట్లకి సంబంధించిన కెప్టెన్లు.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడవలసి ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్లు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">