IND vs Pak: చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా… ఇవాళ పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ తీసుకుంది. పాకిస్తాన్ టాస్ గెలవడంతో… టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దీనిపై రోహిత్ శర్మ మాట్లాడుతూ… టాస్ గెలిచినా కూడా… మేము బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
Also Read: AUS vs ENG: జోష్ ఇంగ్లిస్ విధ్వంసం..ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆసీస్ భారీ విజయం
ఇక టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ఇవాళ 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. దీంతోపాటు… స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 చానల్స్ లో ఈ మ్యాచ్ ప్రసారమవుతుంది. జియో హాట్ స్టార్ రీఛార్జి చేసుకున్న వారు… ఈ మ్యాచ్లు ఫ్రీగా చూడవచ్చు. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో టీం ఇండియా ఒక మ్యాచ్ గెలవగా… పాకిస్తాన్ మాత్రం ఒక మ్యాచ్ లో ఓడిపోయింది. దీంతో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతోంది రోహిత్ సేన. అటు ఎలాగైనా టీం ఇండియా పై గెలవాలని పాకిస్తాన్… స్కెచ్ లు వేస్తోంది.
ఇది ఇలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో ( Champions Trophy ) ఇప్పటి వరకు 5 సార్లు పాకిస్థాన్ ( Pakisthan ) అలాగే టీమిండియా ( Team India) జట్లు తలపడ్డాయి. 5 సార్లు పాకిస్థాన్ అలాగే టీమిండియా జట్లు తలపడితే…. పాకీలే పై చేయి సాధించారు. ఈ 5 మ్యాచ్ లలో టీమిండియా 2 మాత్రమే గెలిచింది. కానీ పాకిస్థాన్ జట్టు మాత్రం… 3 మ్యాచ్ లు గెలవడం జరిగింది. ఇందులో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో…. రెండు సార్లు పాకిస్థాన్ అలాగే టీమిండియా జట్లు తలపడ్డాయి. అప్పుడు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో టీమిండియా చిత్తుగా ఓడింది. దాదాపు 150 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఇలాంటి నేపథ్యంలో… ఇవాళ పాకిస్థాన్ ( Pakisthan ) అలాగే టీమిండియా ( Team India) జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా హట్ ఫేవరేట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
Also Read: India vs Pakistan: రోహిత్ శర్మ vs రిజ్వాన్… టీమిండియా గెలిచే Percentage ఎంతంటే ?
జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI): ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(w/c), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్