BigTV English

IND SA In Semi-finals: ఈ జట్ల మధ్యే సెమీస్.. నేరుగా ఫైనల్స్ కు టీమిండియా !

IND SA In Semi-finals: ఈ జట్ల మధ్యే సెమీస్.. నేరుగా ఫైనల్స్ కు టీమిండియా !

IND SA In Semi-finals: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా న్యూజిలాండ్ వరుసగా రెండవ విజయాన్ని సాధించింది. సోమవారం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ ని ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఫలితంతో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు టోర్నమెంట్ నుండి నిష్క్రమించాయి. ఈ టోర్నీలో ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంటి బాట పట్టాయి. ఇక టీమిండియా కూడా సెమీఫైనల్ చేరింది. గ్రూప్ ఏ లో రెండు మ్యాచ్లలోనూ విజయం సాధించిన టీం ఇండియా రెండవ స్థానంలో ఉంది.


 

భారత రన్ రేట్ 0.647 గా ఉంది. ఇక సోమవారం బంగ్లాదేశ్ నీ చిత్తు చేసిన న్యూజిలాండ్ తనతో పాటు టీమిండియాను కూడా సెమీఫైనల్ లోకి తీసుకువెళ్లింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉంది న్యూజిలాండ్. 0.863 రన్ రేట్ తో గ్రూప్ ఏ లో తొలి స్థానంలో ఉంది. ఇక గ్రూప్ బి లో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికా టీమ్ తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ని చిత్తుగా ఓడించింది. దీంతో సౌత్ ఆఫ్రికా రెండు పాయింట్లు, 2.140 రన్ రేట్ తో తొలి స్థానంలో నిలిచింది.


అలాగే తొలి మ్యాచ్ లో భారీ టార్గెట్ చేదించి ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా గ్రూప్ బి లో రెండవ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఖాతాలో రెండు పాయింట్లతో పాటు 0.475 నెట్ రేట్ రెండవ స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్ గ్రూప్ బి లో మూడవ స్థానంలో ఉంది. ఇక చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు ఆస్ట్రేలియా – సౌత్ ఆఫ్రికా మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. గ్రూప్ బి లో టాప్ 2 అయిన ఈ రెండు జట్లు నేడు రావల్పిండి వేదికగా తలపడబోతున్నాయి.

ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే.. ఆ జట్టు సెమీఫైనల్ కి చేరుకుంటుంది. పోటా పోటీగా ఉన్న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగబోతోంది. ఏ లెక్కన చూసినా గ్రూప్ ఏ నుండి టీం ఇండియా, న్యూజిలాండ్ సెమీస్ కి చేరతాయి. ఇక రన్ రేట్ దృశ్య గ్రూప్ బి నుండి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమిస్ చేరుకుంటాయి. ఇక సెమీస్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. మరో సెమిస్ లో ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ జట్లు తలపడతాయి.

 

వీటిలో న్యూజిలాండ్, టీమిండియా ఫైనల్ కి వెళ్లే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా చేతిలో దారుణంగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్ -2. 140 రన్ రేట్ తో ఇంటి బాట పట్టబోతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్ జట్టు రన్ రేట్ -0.475 గా ఉంది. దీంతో మరో మ్యాచ్ లో గెలిపినప్పటికీ ఇంగ్లాండ్ సెమిస్ కి చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×